Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.!
ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయా చంక్స్‌ను చాలా మంది డైట్లో చేర్చుకుంటారు. ఇక వీటితో చేసుకునే బిర్యానీ, పులావ్, కూరలు, వేపుళ్లు చాలా రకాలు నాలుకు కొత్త రుచిని ఇస్తాయి. అయితే వర్షం పడుతుండగా సోయా చంక్స్‌తో సాయంత్రం సమయంలో ఇలా స్నాక్స్ చేసుకున్నారంటే ఇక జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. తక్కువ ఆయిల్‌తో ఐదే నిమిషాల్లో అయిపోయే ఈ చిరు తిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం..

సోయా చంక్స్ స్నాక్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
సోయా చంక్స్- కప్పు
ఉప్పు- రెండు టీస్పూన్లు
పంచదార- టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్
మసాలా కారం- టీస్పూన్
కారం- టీస్పూన్
ధనియాల పొడి- అర టీస్పూన్
నెయ్యి- ఒకటిన్నర టీస్పూన్
కార్న్ ఫ్లోర్- మూడు టీ స్పూన్లు
వెన్న- టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- పది(కచ్చాపచ్చాగా దంచుకోవాలి)
పచ్చి మిర్చి- రెండు
కొత్తిమీర- కొద్దిగా
నీళ్లు- కప్పు
నిమ్మకాయ- ఒకటి
సోయా చంక్స్ స్నాక్స్ తయారీ విధానం

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుని మరగనివ్వాలి. ఇందులో సోయా చంక్స్, ఉప్పు, చక్కెర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు నీళ్లలో పిండి వీటిని తీసి పక్కన మరో బౌల్లోకి వేసుకోవాలి.
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
సోయా చంక్స్‌లో మసాలా కారం, కారం, ధనియాల పొడి, నెయ్యి, టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి సాఫ్ట్‌గా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టి వేడయ్యాక నెయ్యి, వెన్న వేసి కరగనివ్వాలి. కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా గుండ్రంగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కలిపాక, రెండు టీస్పూన్ల కార్న్ ఫ్లోర్‌ను కొన్ని నీళ్లు పోసి కలుపుకొని తాలింపులో వేయాలి.
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే..
చివరిగా ఇందులో సోయా చంక్స్ వేసి కలుపుకొని కాస్త చిక్కగా అయిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. నిమ్మకాయ రసంతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే..
వర్షం పడుతుండగా సాయంత్రం సమయంలో ఈ ఆరోగ్యకరమైన చిరుతిండి పిల్లలు, పెద్దలందిరికీ ఫేవరెట్ స్నాక్‌గా మారుతుంది. ప్రొటీన్ పుష్కలంగా ఉండటంతో ఎక్కువసేపు ఎనర్జీగా ఉండగలరు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
