Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!
మహిళల్లో పీరియడ్స్, ఫిట్‌నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి
ఈ రోజుల్లో మహిళలు ఆరోగ్యకరంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రమరహిత పీరియడ్స్, రుతుస్రావం సమయంలో నొప్పి, అలసట ఇంకా వివిధ రకాల ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఎక్కువగా బయట దొరికే ఇన్‌స్టంట్ ప్రొటీన్ పౌడర్‌పైన ఆధారపడుతున్నారు. అయితే వీటిలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తుంటారు. ఈ క్రమంలో చక్కెర ఉపయోగించకుండా తాజా పదార్థాలతో ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసుకోండి. మీ బడ్జెట్‌లోనే ఈ పౌడర్‌ను సింపుల్‌గా చేసుకోవచ్చు.

ప్రొటీన్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బాదం- 30 గ్రాములు
జీడిపప్పు- 30 గ్రాములు
పిస్తా పప్పు- 30 గ్రాములు
వాల్‌నట్స్- 30 గ్రాములు
వేయించిన శనగపప్పు- 50 గ్రాములు
పుచ్చకాయ గింజలు- 10 గ్రాములు
గుమ్మడి కాయ గింజలు- 10 గ్రాములు
సన్‌ఫ్లవర్ సీడ్స్- 10 గ్రాములు
పూల్ మఖానా- 50 గ్రాములు
పటిక బెల్లం- 30 గ్రాములు
కుంకుమ పువ్వు- పావు టీస్పూన్
ప్రొటీన్ పౌడర్ తయారీ విధానం
ప్రొటీన్ పౌడర్ తయారీ కోసం ముందుగా స్టవ్‌పైన వెడల్పాటి పాన్ పెట్టుకొని వేడయ్యాక బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్‌నట్స్, వేయించిన శనగపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి.

ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్‌లో వేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
అదే పాన్‌లో పూల్ మఖానా వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి చల్లారబెట్టిన డ్రై ఫ్రూట్స్, పూల్ మఖానా వేసుకోవాలి. ఇందులోనే చక్కెరకి బదులుగా పటిక బెల్లం వేసుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పౌడర్ చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసుకుని గాలి చొరబడకుండా మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి.

అంతే చక్కెర లేకుండా సహజసిద్ధమైన ప్రొటీన్ పౌడర్ రెడీ. ఈ పౌడర్‌ను మహిళలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా రాత్రి పడుకునే ముందు వేడి పాలలో కలుపుకొని తాగవచ్చు.
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.!
ఈ ప్రొటీన్ పౌడర్ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా రోజుల వ్యవధిలో మీ శరీరంలో మార్పులను గమనిస్తారు. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసికంగానూ చురుగ్గా ఉండటానికి ఈ హెల్తీ పౌడర్ దోహదపడుతుంది. ఉద్యోగం చేసే మహిళలు తప్పనిసరిగా తమ డైట్‌లో చేర్చుకోవాల్సిన పౌడర్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
