డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా..

Posted By:

సాయంత్రం పూట స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు హెల్తీగా, డీఫ్ ఫ్రై లేకుండా, మంచి స్నాక్ చేసి పెట్టాలనుకున్నప్పుడు సగ్గుబియ్యం పొంగనాలు బెస్ట్ ఆప్షన్. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లోకి కూడా రోజూ తినే ఉప్మా, ఇడ్లీ, దోశ, వడలు బోర్ కొట్టినప్పుడు కూడా కొత్తగా, ఆరోగ్యకరంగా సగ్గుబియ్యం పొంగలు ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి.

వీటి తయారీకి పెద్ద సమయం పట్టదు. తయారుచేసుకోడానికి ఇంట్లో రెగ్యులర్ గా ఉండే పదార్థాలే సరిపోయాయి. పైన క్రిస్పీగా, లోపల స్పాంజ్ లా మెత్తగా ఉంటూ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthy Saggubiyyam Ponganalu Recipe in Telugu No Deep Fry Evening Snack for Kids

తయారీకి కావాల్సిన పదార్థాలు

-సగ్గుబియ్యం
-పెరుగు
-ఉప్పు
-అల్లం
-పచ్చిమిర్చి

ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్

-బియ్యం పిండి
-కొత్తిమీర
-కరివేపాకు
-ఉల్లిపాయ
-నూనె(కాల్చుకోడానికి కొద్దిగా)

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు పెరుగ, కొంచెం ఉప్పు వేసి కలిపి 4 గంటలు అలా వదిలేయండి.

-4 గంటల తర్వాత సగ్గుబియ్యం పెరుగు మొత్తం పీల్చేసుకుని ఉబ్బినట్లుగా ఉంటాయి. ఇప్పుడు అందులో 1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టీస్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పావు కప్పు కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు తరుగు, 1 ఉల్లిపాయ సన్నని తరుగు, 3 టీస్పూన్ల బియ్యం పిండి వేసి అంతే బాగా కలిసేలా చేత్తో కలుపుకోండి.

-తర్వాత అందులో నుంచి కొంచెం కొంచెంగా సగ్గుబియ్యం మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా(ఉండల్లా) చుట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పుంగనాల పాన్ పెట్టుకోండి. పుంగనాల పాన్ గుంతల్లో కొంచెం నూనె వేసుకోండి. తర్వాత అందుల్లో బాల్స్ లా చేసుకున్న వాటిని పెట్టండి. ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి తిప్పి వాటిని కాల్చుకోండి. దీనికి 7-8 నిమిషాల సమం పడుతుంది.

-అంతే టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు రెడీ.

-వీటిని టమాటో చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో తింటే చాలా బాగుంటాయి.

[ of 5 - Users]
Story first published: Saturday, October 31, 2026, 19:54 [IST]
Desktop Bottom Promotion