Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి..

Posted By:

అసలైన హైదరాబాదీల పెళ్లిళ్లలో తప్పనిసరిగా ఉండే స్వీట్ సొరకాయ పాయసం. దీనినే ఉర్దూలో కద్దూ కీ ఖీర్ అని పిలుస్తారు. పాలు, కోవా, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్ కలయికతో కాస్త జారుగా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ పాయసం.

హైదరాబాద్ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Healthy Sweet Recipe How to Make Hyderabad Wedding Style Sorakaya Payasam at Home in Telugu

కావాల్సిన పదార్థాలు

-సగ్గుబియ్యం
-సొరకాయ తురుము
-పాలు
-జీడిపప్పు
-బాదంపప్పు
-పిస్తా
-వెనీలా కస్టర్డ్ పౌడర్
-చక్కెర
-యాలకల గింజల పొడి
-నెయ్యి
-పచ్చి కోవా
-వెనీలా ఎసెన్స్

ప్రోటీన్స్ నిండిన రాజస్థానీ పంచరత్న దాల్..అమృతాన్ని తలపించే రుచి..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో 1/3 కప్పు సగ్గుబియ్యం వేసి, నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వత అందులో నీళ్లు పోసి కనీసం 1 గంట సేపు నానబెట్టుకోండి.

-సగ్గుబియ్యం నానేలోగా మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పిస్తాపప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు వేసి జస్ట్ పల్స్ చేసి తీసుకోండి. మెత్తటి పౌడర్ అక్కర్లేదు..పలుకులుగా అక్కడక్కడా పాయసంలో తగులుతుంటేనే బాగుంటుంది.

-తర్వాత స్టవ్ ఆన్ చేయండి. అడుగు మందంటా ఉండే ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో 1/3 కప్పు నీళ్లు, 1 లీటరు చిక్కని పాలు పోసి పెద్ద మంట మీద కలుపుతూ పాలను 2-3 పొంగులు రానివ్వండి.

-తర్వాత అందులో 1 గంటసేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి 4- 5 నిమిషాల పాలు ఉడికించాలి.

-సగ్గుబియ్యం ఉడికేలోగా ఒక గిన్నెలో అరకప్పు వేడిపాలు పోసి అందులో 2 టేబుల్ స్పూన్ల వెనీలా కస్టర్డ్ పౌడర్ ను వేసి కలిపి పక్కన పెట్టుకోండి.

-4-5 నిమిషాలకు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి. ఈ పాలను 8-10 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి గిన్నెను దించేయండి.

-ఇప్పుడు 2 కప్పుల సొరకాయ తురుము కావాలి. ఇందుకోసం సొరకాయ మధ్యలో దూదిలా గింజలతో ఉండే భాగాన్ని, సొరకాయ పైన ఉండే పెచ్చుని తీసేసుకోవాలి. కేవలం కండను మాత్రమే మధ్యస్థంగా ఉండే రంధ్రాలపై తురుముకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి అందులో ఈ సొరకాయ తురుము వేసి 4 నిమిషాల పాటు మీడియం మంట బాగా వేయిస్తే పసరు వాసన పోతుంది. అప్పుడు అందులో అరకప్పు నీళ్లు పోసి 2-3 నిమిషాలు వేయించుకోండి. తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పాల సగ్గుబియ్యం మిశ్రమం మొత్తాన్ని ఇందులో వేసి, ఇందులోనే 1 కప్పు చక్కెర వేసి దాన్ని కరగనివ్వాలి.

-చక్కర కరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా,బాదంపప్పుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో 100 గ్రామల పచ్చి కోవా వేసి కలుపుకోవాలి. పాయసం కాస్త ఉడుకుపట్టిన తర్వాత స్టవ్ ఆపేసి,అందులో 1 టీస్పూన్ యాలకల గింజల పొడి, అరటేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి కలిపి దింపేసి పూర్తిగా చల్లార్చండి. దీన్ని ఫ్రిడ్జ్ లో 2 గంటలు పెడితే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది.

[ of 5 - Users]
Story first published: Monday, August 31, 2026, 12:42 [IST]
Desktop Bottom Promotion