Latest Updates
-
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు! -
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.!
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.!
మన తెలుగు సంప్రదాయ వంటకాల్లో పచ్చళ్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్నంలో మొదటి ముద్ద పచ్చడితో తింటేనే భోజనం సంతృప్తిగా చేసిన అనుభూతి ఉంటుంది. ఆ తర్వాతే కూరలు, రసం, చివర్లో పెరుగు. మరి అలాంటి అద్భుతమైన పచ్చళ్లలో మినుముల పచ్చడి ఒకటి. ఆంధ్రా, రాయలసీమలో పాత కాలం నాటి నుంచి ఈ పచ్చడి చాలా స్పెషల్. ఇక నెల్లూరు స్టైల్‌లో చేశారంటే ఈ పచ్చడిని మెతుకు కూడా వదలకుండా తింటారు. నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం..

నెల్లుూరు స్టైల్ మినుముల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
చింతపండు- నిమ్మకాయ సైజు
మినప్పప్పు- 100 గ్రాములు
ఎండుమిర్చి- 15
మెంతులు- అర టీస్పూన్
నూనె- రెండు టీ స్పూన్లు
జీలకర్ర- అర టీస్పూన్
ధనియాలు- రెండు టీస్పూన్లు
ఆవాలు- అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- ఆరు లేదా ఏడు
ఉల్లిపాయ- ఒకటి
నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి తయారీ విధానం
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
మినుముల పచ్చడి కోసం ముందుగా చింతపండును కడిగి కొన్ని నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో టీస్పూన్ నూనె వేసి కాగిన తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండు మిర్చి కట్ చేసి దోరగా వేగనివ్వాలి.

ఇవన్నీ బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకుని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి మినప్పప్పును వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకుని చల్వారనివ్వండి.
ఈ లోపు ముందు వేయించుకున్న చల్లారిన దినుసులను మిక్సీ జార్‌లో వేసి వీలైనంతగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండును నీళ్లతో సహా వేసుకుని రుచికి సరిపడా రాతి ఉప్పు లేదా సన్నటి ఉప్పు వేసి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.!
అనంతరం వేయించిన మినప్పప్పును వేసి మరోసారి రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి కచ్చాపచ్చాగానే రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బకూడదు. లేదంటే ఉల్లిపాయ నలిగితే దాని రుచి పోతుంది.
రుచికరమైన నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలోకి తింటే అద్భుతంగా ఉంటుంది. పాతకాలం నాటి ఈ ఆరోగ్యకరమైన రెసిపీతో మన పూర్వీకులు ఎంతో బలంగా ఉండేవారు. పచ్చళ్లను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. డయాబెటిస్, హై బీపీ బాధితులు వారానికోసారైనా ఈ పచ్చడిని ట్రై చేయాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
