Latest Updates
-
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్?
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.!
ఈ రోజుల్లో ఒంట్లో షుగర్ పెరుగుతున్న కొద్దీ ఇంట్లో షుగర్ తగ్గుతోంది. కారణం డయాబెటిస్ బాధితులే కాదు.. మధుమేహం రాకుండా ఉండేందుకు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే స్వీట్స్ తినాలని ఎంత కోరిక ఉన్నా ఆరోగ్యం కోసం ఆ క్రేవింగ్స్‌ను అదుపులో ఉంచుకుంటారు. అయితే ఎన్నాళ్లని అలా కడుపు చంపుకొని ఉంటారు. క్రేవింగ్స్ తీరితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఒక హెల్తీ సలాడ్ రెడీగా ఉంది. ఈ సలాడ్ చాలా స్వీట్‌గా ఉంటుంది. కానీ చక్కెర ఉండదు. డయాబెటిస్ ఉన్నవారు నిర్భయంగా తినేయొచ్చు.

స్వీట్ తినాలనే కోరికను అదుపులో ఉంచుకోకుండా ఆ క్రేవింగ్స్‌ను నెరవేర్చుకోవాలంటే గ్రీన్ యాపిల్ సలాడ్ బెస్ట్ ఆప్షన్. సహజసిద్ధమైన తీపి రుచితో ఉండే ఈ సలాడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. ఈ గ్రీన్ యాపిల్ సలాడ్ తయారీ విధానం తెలుసుకుందాం..
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
గ్రీన్ యాపిల్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పెరుగు- పావు కప్పు
వేరుశనగ గుండ్లు- అర కప్పు
వాల్‌నట్స్- ఐదు
బాదం పప్పులు- పది
గ్రీన్ యాపిల్స్- రెండు
తేనె- టీస్పూన్
ఎండు ద్రాక్ష- పది
గ్రీన్ యాపిల్ సలాడ్ తయారీ విధానం
గ్రీన్ యాపిల్ సలాడ్ తయారీ కోసం ముందుగా చిక్కటి, తియ్యటి పెరుగు తీసుకోవాలి. పావు కప్పు పెరుగును శుభ్రమైన పొడి క్లాత్‌లో వేసుకుని గట్టిగా కట్టి దానిని ఒక వెడల్పాటి బౌల్‌లో పెట్టి మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా పెరుగు పనీర్ మాదిరిగా సాఫ్ట్‌గా, గట్టిగా అవుతుంది. ఎండు ద్రాక్షను మూడు గంటలపాటు నానబెట్టుకోండి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో వేరుశనగ గుండ్లను చిన్న మంటపైన వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా క్రిస్పీగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో వేసుకుని చిటికెడు ఉప్పు జత చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసి పేస్ట్‌లా రుబ్బుకున్నట్లయితే సలాడ్‌లోకి అద్భుతంగా ఉంటుంది. ఈ పీనట్ బటర్‌ను అవసరమైనంత వాడుకుని మిగిలింది ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు బాదం పప్పులు, వాల్‌నట్స్‌ను కూడా క్రంచీగా అయ్యేవరకు వేయించుకోండి. గ్రీన్ యాపిల్‌ను తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
కట్ చేసిన గ్రీన్ యాపిల్ ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో పెరుగు, టీస్పూన్ తేనె వేసి కలపండి, ఇప్పుడు బాదం, వాల్‌నట్స్‌ను వేసి మరోసారి కలపండి. ఈ మిశ్రమంలో పీనట్ బటర్‌ను స్పూన్‌తో చిలకరించి స్పూన్‌తో సున్నితంగా కలపండి. అంతే హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ యాపిల్ సలాడ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
