Latest Updates
-
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్!
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.!
గుమ్మడికాయ అనగానే మనకు ఎక్కువగా దిష్టికి ఉపయోగించడం గుర్తొస్తుంది. కానీ ఈ గుమ్మడికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గింజలు మొదలుకొని కాయల వరకు శరీరంలో ఎన్నో రకాల రోగాలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇక గుమ్మడికాయతో చేసే దప్పళం వంటకం మన పూర్వీకుల బలమైన ఆరోగ్యానికి రహస్యం అంటే అతిశయోక్తి కాదు. ఈ కాలంలోనూ అలాంటి ఆరోగ్యం కావాలంటే ఈ వంటకాన్ని తప్పనిసరిగా డైట్లో చేర్చుకోవాల్సిందే.. గుమ్మడికాయ దప్పళం ఎలా తయారు చేయాలో చూద్దాం..

గుమ్మడికాయ దప్పళం తయారీకి కావాల్సిన పదార్థాలు
గుమ్మడికాయ- ఒకటి
చింతపండు- నిమ్మకాయ సైజు
ఉల్లిపాయలు- నాలుగు
పచ్చిమిర్చి- నాలుగు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
పచ్చిశనగపప్పు- టీస్పూన్
మినప్పప్పు- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
ఎండుమిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- పది
బెల్లం- మూడు టీస్పూన్లు
బియ్యంపిండి- రెండు టీస్పూన్లు
గుమ్మడికాయ దప్పళం తయారీ విధానం
ముందుగా చింతపండును కడిగి కొన్ని నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత గుమ్మడికాయను పైనుంచి మట్టిలేకుండా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన కడాయి లేదా బాణలి పెట్టుకుని వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలను వేసి కలపండి. మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికిన తర్వాత గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరో పదినిమిషాల పాటు ఉడకనివ్వండి.

గుమ్మడి కాయ ముక్కలు ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మూతపెట్టండి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి కలపండి.
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
అనంతరం నానబెట్టిన చింతపండు రసాన్ని పోసుకుని కలిపి మీకు కావాల్సిన విధంగా గ్రేవీ కోసం నీళ్లు పోసి మరోసారి కలపండి. బెల్లం వేసి కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు మీడియం మంటపైన ఉడికించుకోండి.
ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యంపిండిని వేసుకుని కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి దానిని కూరలో వేసి కలపండి. ఈ పిండి కలపడం ద్వారా గ్రేవీ చిక్కగా అవుతుంది. తర్వాత ఉప్పు సరిచూసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. గ్రేవీ మరుగుతున్నప్పుడు నూనె పైకి తేలుతూ మీకు కావాల్సిన విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే..
గుమ్మడికాయ దప్పళం రెడీ. మధ్యాహ్నం లంచ్‌లో వేడిగా అన్నంలోకి ముద్ద పప్పు, అప్పడాలు లేదా ఆమ్లెట్‌తో తింటే ఆ రుచికి ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
