Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈ జావ తాగితే ఎలాంటి సమస్యలైనా తగ్గిపోతాయ్..రాగిజావ కంటే 100 రెట్లు బెస్ట్,ఎలా చేయాలంటే..
కరోనా తర్వాత జనాలందరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు కూడా ఆరోగ్యం పట్ల చాలామంది ఆరోగ్యంపై కేరింగ్ తీసుకునేటోళ్లు కానా కోవిడ్ తర్వాత నుంచే అందరిలో ఆరోగ్యం ఉంటే చాలురా బాబు అనుకునే పరిస్థితి వచ్చింది. శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందించడంలో మిల్లెట్స్ జావ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటుంది. మిల్లెట్స్ జావ అనేది చిరుధాన్యాలతో తయారు చేయబడే ఒక పోషకమైన పానీయం. మిల్లెట్స్ లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి.
గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి , ఎముకలను బలోపేతం చేయడానికి,మధుమేహాన్ని నియంత్రణకు, అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడంలో సహాపడే మిల్లెట్స్ జావని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మిల్లెట్స్ జావ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
మిల్లెట్స్ జావ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
కొర్రలు లేదా మీకు నచ్చిన మిల్లెట్స్(రాగులు, సజ్జలు,జొన్నలు)- 1కప్పు
నీరు - 3 కప్పులు
పాలు లేదా పెరుగు- 1 కప్పు
బెల్లం లేదా తేనె - రుచికి తగినంత
ఏలకుల పొడి - 1/2 టీస్పూన్
బాదం, కాజు, డ్రైఫ్రూట్స్ - అలంకరణ కోసం
నెయ్యి - 1 టీస్పూన్
మిల్లెట్జ్ జావ తయారీ విధానం
-ముందుగా మిల్లెట్స్‌ను శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
-నానిన మిల్లెట్స్‌ను నీటితో సహా కుక్కర్‌లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-మిల్లెట్స్ మెత్తగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత మిల్లెట్స్‌ను మెత్తగా చేసుకోవాలి.
-ఒక గిన్నెలో మెత్తగా చేసుకున్న మిల్లెట్స్, నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇందులో బెల్లం లేదా తేనె కలిపి మరో 2 నిమిషాలు మరిగించాలి.
-కావాలంటే పాలు లేదా పెరుగు కూడా కలుపుకోవచ్చు.
-చివరగా ఏలకుల పొడి, డ్రైఫ్రూట్స్, నెయ్యి చేసి అందంగా అలంకరించాలి. అంతే మిల్లెట్స్ జావ రెడీ. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే బెల్లం లేదా తేనెను తక్కువగా ఉపయోగించడం బెటర్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications



