Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
బియ్యం,అటుకులు అక్కర్లేదు..శనగలు,బొబ్బర్లతో హై ప్రొటీన్ దోశ..రుచితో పాటే ఆరోగ్యం..ఎలా చేసుకోవాలంటే
ప్రతిరోజూ అవే ఇడ్లీలు, దోశలు తిని విసుగెత్తిపోయారా? ఉదయాన్నే ఆరోగ్యకరమైన, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే బ్రేక్ ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే ఒక్కసారి హై ప్రోటీన్ దోశ ట్రై చేయండి. కేవలం రుచిలోనే కాదు, పోషకాల విషయంలోనూ ఇది ఒక ఖజానా. పప్పుధాన్యాలు, శెనగలు, క్వినోవా వంటి సూపర్ ఫుడ్స్ కలయికతో తయారైన ఈ దోశ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. సాధారణంగా మనం బియ్యం, మినపప్పుతో దోశలు వేసుకుంటాం. కానీ ఈ దోశలో శనగలు, పెసలు, కందులు, బొబ్బర్లు, క్వినోవా వంటి ఎన్నో బలవర్థకమైన పదార్థాలను వాడుతున్నాం. ఈ హై ప్రొటీన్ దోశను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
హై ప్రొటీన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
నల్ల శనగలు-1 కప్పు
తెల్ల శనగలు- 1 కప్పు
మినపప్పు- 1 కప్పు
పెసలు- 1కప్పు
ఎర్ర కందిపప్పు- 1కప్పు
బొబ్బర్లు(అలసందలు)-1 కప్పు
క్వినోవా-2 కప్పులు
సగ్గుబియ్యం- 2 టేబుల్ స్పూన్లు
మెంతులు- 2 టీస్పూన్లు
తయారీ విధానం
-హై ప్రొటీన్ దోశ తయారీకోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో నల్ల శనగలు, తెల్ల శెనగలు, మినపప్పు, పెసలు, అలసందలు, క్వినోవా, ఎర్రయ కందిపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-ఇదే సమయంలో ఓ చిన్న బౌల్ లో సగ్గుబియ్యం కూడా వేసి నానబెట్టండి, ఇంకో బౌల్ లో మెంతులు వేసి నీళ్లు పోసి నానబెట్టండి
-రాత్రంతా నానబెట్టిన వీటన్నింటినీ ఉదయాన్నే నీటిని వంపేసి అన్నింటినీ కలిపి మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలిపి వాతావరణాన్ని బట్టి 8-10 గంటల పాటు పులియబెట్టాలి. చేత్తో కలపడం వల్ల పిండి సహజంగా, చక్కగా పులిసి దోశలు మెత్తగా, రుచిగా వస్తాయి.
-దోశలు వేసుకునే ముందు కావలసినంత పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
-స్టవ్ మీద దోశ పెసం పెట్టి వేడిగా ఉన్న పెనంపై నూనె రాసి, పలుచగా దోశలు వేసుకుని, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే పోషకాలతో నిండిన వేడివేడి దోశలు రెడీ. వీటిని పల్లీల చట్నీ లేదా ఘాటైన అల్లం చట్నీతో తింటుంటే ఆ రుచే అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




