Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
టిఫిన్స్ లోకి ఒక్కసారి ఈ టమాటా కుర్మా రుచి చూస్తే..పల్లీ చట్నీ, సాంబార్ మర్చిపోతారు!
సాధారణంగా మనం ఉదయం పూట ఇడ్లీ, దోశలు వంటి టిఫిన్స్ లోకి పుట్నాల చట్నీ, పల్లి చట్నీ లేదా సాంబార్ చేసుకుంటాం. కొంతమంది టమాటో చట్నీ కూడా చేస్తుంటారు. కానీ ఎప్పుడూ అవే చట్నీలు తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి హోటల్ స్టైల్ టమాటా కుర్మా చేసి చూడండి.. ఇంట్లో వాళ్లంతా మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు.
ఇడ్లీ, దోశల్లోకే కాదు వేడి వేడి చపాతీ, పూరీ, పొంగల్, బగారా రైస్ ఇలా దేనిలోకైనా ఈ కుర్మా అమృతంలా ఉంటుంది. అచ్చం హోటల్ రుచితో టమాటా కుర్మా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
టమాటా కుర్మాకి కావాల్సిన పదార్థాలు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
జీడిపప్పు - 4 లేదా 5
పచ్చిమిర్చి - 1
గసగసాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
టమాటాలు - 3
నూనె - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 2
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పుదీనా ఆకులు - ఒక గుప్పెడు
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
పసుపు -పావు టీస్పూన్
ఉప్పు - సరిపడా
నీళ్లు - గ్రేవీకి తగినన్ని
కొత్తిమీర - కొద్దిగా
టమాటా కుర్మా తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి, గసగసాలు, సోంపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడి అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి అవి మంచి సువాసన వస్తున్నప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు మారే వరకు వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఆ వెంటనే గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరో నిమిషం పాటు కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి.. పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడకుండా కొద్దిగా నీళ్లు పోసి, పచ్చి వాసన పోయేలా నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.
-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా-కొబ్బరి పేస్ట్ ను కుక్కర్లో వేసి బాగా కలపాలి. గ్రేవీ మీకు ఎంత చిక్కగా కావాలో చూసుకుని దానికి తగినట్లుగా నీళ్లు పోసి ఒకసారి కలపాలి.
-కుక్కర్ మూత పెట్ట 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పూర్తిగా పోయాక మూత తీసి, సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లుకుంటే చాలు.
-అంతే గుమగుమలాడే వేడి వేడి హోటల్ స్టైల్ టమాటా కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












