Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
అటుకులతో దోశ.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో తెలుసా?
అటుకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో చాలా త్వరగా అరిగిపోతాయి. అలాగే అటుకులతో చేసుకునే వంటలు కూడా చాలా త్వరగా అయిపోతాయి. వీటిని వండుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అందుకే అటుకులతో వంటలు చేసుకుంటే సమయం ఆదా అవడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే భోజనం చేసినట్లు ఉంటుంది. అయితే అటుకులతో చేసుకోగలిగే అయిదు రకాల వంటకాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోహా..
పోహా! ఈ పేరు వినని వారు ఉండరు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతేదేశంలో చాలా మంది దీన్ని తింటూ ఉంటారు. ఈ పోహాను అటుకుల ఉప్మా అని కూడా పిలుస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కేవలం అయిదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు అటుకులను నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు కూడా వేసుకోవాలి.

ఆ తరువాత వేరుశనగ, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసుకొని ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే వేడి వేడిగా ఎంతో రుచికరమైన పోహా సిద్ధమైపోతుంది. అందులో ఒక నిమ్మకాయ పిండుకొని తింటే రుచి అమోఘమంతే! ఇది పిల్లలకు మంచి పోషకాహారంగా చెప్పుకోవచ్చు.
అటుకుల దోశ..
అటుకులతో పోహా మాత్రమే కాదు దోశ కూడా చేసుకోవచ్చు. అటుకులతో చేసుకునే దోశ ఎంతో రుచికరంగా ఉంటుంది. పిల్లలు తినేందుకు కూడా ఈ దోశ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ అటుకుల దోశ చేసుకోవడానికి దోశ పిండిలో బియ్యంకు బదులుగా అటుకులను వేసుకోవాలి. బియ్యం పిండికి బదులు అటుకులను కలుపుకొని, దోశ వేసుకుంటే అటుకుల దోశ సిద్ధమైపోతుంది.
అటుకుల మిక్చర్..
అటుకులతో చేసే మిక్చర్ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది సాధారణంగా ఏదైనా కిరాణా షాపుల్లో దొరుకుతుంది. దీనిని చిన్న పిల్లలు కూడా ఎంతగానో ఇష్టంగా తింటూ ఉంటారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ అటుకుల మిక్చర్‌ను సులభంగా చేసుకోవచ్చు. ఈ అటుకుల మిక్చర్ చేసుకోవడానికి.. ఒక కడాయి తీసుకొని అందులో వేరుశనగ, ఎండుకొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. అందులో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటిపై అటుకులు వేసుకొని కారం, పసుపు, ఉప్పు మసాలాలు అంతా అటుకులు పట్టుకునేవరకు కలుపుకోవాలి.
ఇప్పుడు వాటిపై ఒక్క నిమ్మకాయ రసం పిండుకొని ఒక ప్లేట్‌లో తీసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన అటుకుల మిక్చర్ సిద్ధమైనట్లే. దీన్ని పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా పెట్టి పంపించొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎంతో రుచిని అందిస్తుంది.
అటుకుల లడ్డు..
మీరు చాలా రకాల లడ్డూలు చూసి ఉంటారు. అలాగే తిని ఉంటారు కూడా. అయితే అటుకులతో చేసే లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? ఈ అటుకుల లడ్డూను తయారు చేయడానికి ముందుగా అటుకులను నూనెలో వేయించుకోవాలి. తరువాత బెల్లంను పానకంలా చేసుకొని.. వేయించి పెట్టుకున్న అటుకులను అందులో వేసుకొని లడ్డూలాగా చేసుకుంటే సరిపోతుంది. అటుకుల లడ్డూ తయారవుతుంది. ఇది రుచికరంగా ఉండడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
అటుకులతో ఇడ్లీ..
సాధారణంగా ఇడ్లీని మినపప్పుతో చేసుకుంటూ ఉంటారు. అయితే అటుకులతో చేసుకునే ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయట. దీన్ని తయారు చేయడానికి ఇడ్లీ పిండిని తయారుచేసుకునేటప్పుడు అందులో అటుకులు వేసుకొని రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న పిండితో ఇడ్లీలు వేసుకుంటే అటుకుల ఇడ్లీ సిద్ధమైపోతుంది. ఇలాంటి ఇడ్లీలు చాలా మృదువుగా తయారవడంతో పాటు, ఎంతో రుచికరంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించండినది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించేముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకుంటే ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications