Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
Punnilu: పేదవాడి అమృతం..100 కరోనా వైరస్ లు వచ్చినా తట్టుకునే శక్తి,ఎలా చేసుకోవాలంటే
ఎండాకాలం దాదాపుగా వచ్చేస్తుంది. సమ్మర్ లో వేడి తాపాన్ని తట్టుకునేందుకు చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. అయితే దీని వల్ల అనారోగ్యాలకు గురయ్యే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి మన పూర్వీకుల మాదిరిగా పున్నీళ్లను హాయిగా సమ్మర్ లో ఆస్వాదిస్తే ఆ టేస్ట్ కి స్వర్గం కనబడతది. పున్నీళ్లను అన్నంలో కలిపి తిన్నా, కూల్ డ్రింక్ లా ఎలా తీసుకున్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పున్నీళ్ల అన్నం తినడం వల్ల బాడీలో ఎండ తాపాన్ని తగ్గిస్తుంది, వడదెబ్బ తగలకుండా చూస్తుంది. శరీరంలోని వేడిని తర్వగా తగ్గించే పాతకాలం నాటి పున్నీళ్లని ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
పున్నీళ్ల తయారీకి కావాల్సిన పదార్థాలు
-గంజినీళ్లు
-వాటర్
-ఉప్పు
-మిగిలిన చద్దన్నం
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-ఊరగాయ

పున్నీళ్ల తయారీ విధానం
-ముందుగా అన్నాన్ని గంజి వార్చుకునేలాగా వండుకోవాలి.
-గంజినీళ్లను ఓ గిన్నెలోకి వంపుకొని పక్కనపెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత గంజికి పట్టే మీగడను తీసివేయాలి.
-ఇప్పుడు ఆ గంజిలో 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి కదిలించకుండా 3 రోజులు పక్కన పెట్టేయాలి.
-3 రోజుల తర్వాత మూత తీసి చూస్తే గంజి అడుగకు వెళ్లి పైకి తేరుకున్న వాటర్ నే పున్నీళ్లు అంటారు. అడుగున ఉన్న వాన్ని మడ్డి అంటారు దాన్ని వాడుకోకూడదు. పున్నీళ్లను మరో గిన్నెలోకి మెల్లిగా వంపుకోవాలి.
-పున్నీళ్లలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని ఆస్వాదించడమే.
-అలాగే ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని కూడా పున్నీళ్లలో వేసి రాత్రంతా ఉంచితే తెల్లవారిన తర్వాత దాన్ని మజ్జిగన్నం తిన్నట్లు తినేయడమే. ఉల్లిపాయ పర్చిమిర్చి లేదా ఊరగాయతో నంజుకుంటూ తినవచ్చు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications