Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే సైడ్ డిష్..సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి
మనం రోజువారీ తినే ఆహారం ఎంత రుచిగా ఉన్నప్పటికీ పక్కన నంజుకోవడానికి ఏదైనా సైడ్ డిష్ ఉంటే ఆ భోజన అనుభవం వేరే స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నం, నెయ్యితో పాటు కాస్త పచ్చడి లేదా తొక్కు కలుపుకుని తింటే ఆ రుచే వేరు.
అలాగే ఉదయం టిఫిన్లయిన ఇడ్లీ, దోసె, పెసరట్టు వంటి వాటితో కూడా ఈ తొక్కులు అద్భుతంగా ఉంటాయి. అలాంటి అనేక రకాల నిల్వ పచ్చళ్లలో అల్లం తొక్కు చాలా ప్రత్యేకం. రుచితో పాటు అల్లం ఆరోగ్యానికి, ముఖ్యంగా జీర్ణక్రియకు చాలా మంచిది. తక్కువ సమయంలో ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో సులభంగా అల్లం తొక్కు ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-అల్లం
-చింతపండు
-బెల్లం తురుము
-కారం
-ఉప్పు
-ధనియాలు
-జీలకర్ర
-మెంతులు
-వెల్లుల్లి రెబ్బలు
-నూనె
-ఆవాలు
-జీలకర్ర
-ఎండుమిరపకాయలు
-మినపప్పు
-శెనగపప్పు
-కరివేపాకు
-ఇంగువ
తయారీ విధానం
-ముందుగా చింతపండును తీసుకుని అందులో ఉండే గింజలు, ఈనెలు తీసేసి ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అది మెత్తగా గుజ్జులా అయ్యేలా చూసుకోవాలి.
-స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించి, వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి శుభ్రం చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. అల్లం వేగడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వేయించిన అల్లం ముక్కలను కూడా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు, అల్లం ముక్కలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-స్టవ్ మీద పాన్ పెట్టి బెల్లం తురుము వేసి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత, గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం చింతపండు పేస్ట్, కారం పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. నిల్వ పచ్చడి కాబట్టి నూనె, ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే పడతాయి.
-తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి తగినంత నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. చివరగా కరివేపాకు, మంచి సువాసన కోసం కాస్త ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే అల్లం తొక్కు రెడీ. దీనిని తడి లేని గాజు సీసాలో లేదా జాడీలో భద్రపరుచుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications



