Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
రెస్టారెంట్ స్టైల్ బేబీకార్న్ ఫ్రై రెసిపీ.. తియ్యగా, కారంగా అదిరిపోతుంది..!
బేబీ కార్న్ ఫ్రైని మనం ఇళ్లల్లో ఎక్కువగా చేసుకునే అవకాశం వుండదు. ఎందుకంటే మార్కెట్లో కూడా బేబీకార్న్‌లను చాలా తక్కువగా అమ్ముతుంటారు. కానీ ఈ బేబీకార్న్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వుంటుంది. కేవలం 10 నుంచి 15 నిమిశాల్లోమనం ఈ బేబీ కార్న్ ఫ్రై ని చేసుకోవచ్చు. అన్నంలో దీనిని నంచుకొని తినవచ్చు లేదంటే చపాతీలో కలుపుకొని తినవచ్చు. ఈ బేబీ కార్న్‌లను మనం ఫ్రై రైస్‌లో, చైనీస్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మేము మీకు చెబుతున్నాం.

బేబీ కార్న్ ఫ్రై కోసం ఈ కింది వంట పదార్ధాలను ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి.
1. 1.1/2 టేబుల్ స్పూన్ మంచి నూనె
2. 1/2 టీస్పూన్ జీలకర్ర
3. 1/2 కప్పు ఉల్లిపాయలు
4. 1 టీస్పూన్ తురిమిన అల్లం వెల్లుల్లి పేస్టు
5. 200 గ్రాముల బేబీ కార్న్
6. 1/2 కప్పు క్యారెట్ ముక్కలు
7. తగినంత ఉప్పు
8. 1 చిటికెడు పసుపు
9. పావు కప్పు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, 1/2 కప్పు సన్నగా
తరిగిన పాలకూర
10. 1/2 టీస్పూన్ గరం మసాలా
బేబీ కార్న్ ఫ్రైని ఈ కింది విధంగా రెడీ చేసుకోండి.
1. ముందుగా ప్యాన్‌ను స్టవ్‌పైన పెట్టుకొని అందులో ఒకటిన్నర టీస్పూన్ మంచి నూనెను వేసి వేడి చేయాలి. దాంట్లోనే అర టీస్పూన్ జీలకర్ర, తురిమిన అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంతరకు దీన్ని ప్యాన్‌లో ఫ్రై చేస్తూనే వుండాలి.
2. అర కప్పు కోసి ఉల్లిపాయలు కూడా ప్యాన్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 200ల గ్రాముల బేబీ కార్న్, బెల్ పెప్పర్లు, పసుపును, రుచిక సరిపడ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి.
3. మంటను కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. బెల్‌పెప్పర్స్‌కు బదులుగా క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చని చెప్పిన విషయం తెలిసిందే.
4. ఇప్పుడు ప్యాన్‌కూ మూతపెట్టి 5 నిమిశాల వరకు బాగా ఉడికించాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొంటే బేబీకార్న్ మాడిపోకుండా వుంటుంది. అవసరమైతే ఫ్లేమ్‌ను మరికొంత తగ్గించుకోవాలి. ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి.
5. బేబీ కార్న్ ఉడుకుతున్నప్పుడే అందులో గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. కరివేపాకులను కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుకు బదులుగా మెంతెం కూరను లేదంటే బచ్చలి ఆకులను కూడా మీరు వేసుకోవచ్చు. రుచి కోసం కొంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి.
6. ఇక దీంతో బేబీకార్న్ ఫ్రై రెడీ అయినట్టే. ఈ బేబీ కార్న్ ఫ్రై ని చపాతీతో లేదంటే అన్నంలో నంచుకోవచ్చు. కావాలంటే నేరుగా అలాగే కూడా తినవచ్చు. సాయంత్రం స్నాక్‌లాగా కూడా మీరు ఈ బేబీ కార్న్ ఫ్రైని తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications