Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Banana Halwa: నోట్లో వేస్తే కరిగిపోయే 'బనానా హల్వా'..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
ఏ వయస్సు వారైనా ఇష్టపడే స్వీట్ ఏదైనా ఉందంటే అది హల్వానే. హల్వాలో చాలా రకాలు ఉంటాయి. అందులో బనానా హల్వా ఒకటి. సాధారణంగా ఈ బనానా హల్వా ఎక్కువగా కేరళలో స్వీట్ షాపులలో అందుబాటులో ఉంటుంది. మన దగ్గర స్వీట్ షాపులలో చాలా తక్కువగా లభించే బనానా హల్వా మీరు ఎప్పుడైనా తిన్నారా? తినలేదు అంటే మాత్రం ఇప్పుడే ఓసారి ట్రై చేయండి. బాగా టేస్టీగా ఉంటే ఈ బనానా హల్వాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. బానానా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బనానా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
-అరటిపండు
-తాటి బెల్లం
-నెయ్యి
-అరటిపండు
-జీడిపప్పు
-యాలకల పొడి

బనానా హల్వా తయారీ విధానం
-ముందుగా బాగా పండిన 1 కేజీ అరటిపండ్లను ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి దానిని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1/ 4 కప్పు నెయ్యి పోసి అది కొంచెం వేడెక్కాక మిక్సీలో వేసి చేసుకున్న అరటిపండు పేస్ట్ ని ఇందులో వేయండి. మీడియం మంట మీద కలుపుతూ రంగు మారే వరకు 10 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 500 గ్రాముల తాటి బెట్టం 1/4 కప్పు నీళ్లు పోసి మంటలను లో ప్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి.
-బెల్లం మంచిగా వేగి బాగా చిక్కగా అయిన తర్వాత దీనిని.. పక్కన పెట్టి ఉంచిన అరటిపండు మిశ్రమం ఉన్న పాన్ లో పోసి బాగా కలపండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని స్మూత్ గా అయ్యేవరకు బాగా కలుపుతూ ఉడికించుకోండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం కొంచెం పోస్తూ బాగా కలబెట్టుకోండి.
-తర్వాత పాన్ లో నుంచి ఆ మిశ్రమం సపరేట్ అయ్యేలా వచ్చిన తర్వాత అందులో 1/4 టేబుల్ స్పూన్ యాలకల పొడి, 3 టేబుల్ స్పూన్ ల వేయించిన జీడిపప్పులు వేసి బాగా కలపండి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్ లో కొంచెం నెయ్యి రాసి అందులో ఈ హల్వాను వేసి మంచిగా లెవల్ చేసి 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేస్తే టేస్టీ బనానా హల్వా రెడీ. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని చాలా ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications