Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వేసవి వంటలు : కమ్మని బూందీ రైతాను ఇలా తయారు చేసుకోండి..!
ఈ వేడి వేడి ఎండల్లో.. మండే వేసవి కాలంలో మీకోసం ప్రత్యేకంగ సమ్మర్ రెసిపీలను మీ ముందుకు తీసుకొని వచ్చాము. ప్రత్యేకంగా సమ్మర్ రెసిపీల గురించి ఇస్తున్నాం. ఈ ఎండాకాలంలో మీరు సులభంగా తయారు చేసుకునే విధంగా మీకు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తాం.

మన దేశంలో దక్షిణాదిలో పెరుగు చట్నీ అని మనము పిలుచుకుంటాము. కానీ ఉత్తర భారతంలో దీనినే బూందీ రైతా, లేదా రైతా అని అంటారు. ఈ రెండూ పెరుగుతోనే తయారు చేసినా వీటి రుచి మాత్రం వేరువేరుగా ఉంటుంది. బూందీ రైతాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
బూందీ రైతా కోసం కావలసిన వంట సామాను
ముందుగా నాలుగు చెంచాల బూందీని కప్‌లో తీసుకోవాలి, తరువాత చిటికెడు ఉప్పు, 5 చెంచాల పెరుగు టేబుల్‌పై రెడీగా వుంచుకోవాలి.
తయారు చేసే విధానం
ఐదు చెంచాల పెరుగును, నాలుగు చెంచాల బూందీని, ఉప్పును మూడింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. పెరుగులో ఉప్పు మొత్తం కలిసే విధంగా, బూంది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి.దీంతో మీ బూందీ రైతా తినడానికి రెడీగా ఉంది.
బూందీ రైతాను చల్లగా తింటేనే రుచికరంగా ఉంటుంది. తయారు చేసిన వెంటనే ఫ్రిజ్‌లో కొద్ది సేపు అలాగే వుంచండి. తరువాత చపాతీలో సర్వ్ చేసుకోండి. కేవలం బూందీ రైతా మాత్రమే తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేము.
తయారు చేసుకున్న బూందీ రైతాలో కూడా మంచి పోషకాలు ఉంటాయ్. ప్రస్తుతం ఇక్కడ తయారు చేసుకున్న బూందీ రైతాలో క్యాలరీలు -157కిలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు -10.74గ్రాములు, ప్రొటీన్లు -2.41గ్రా, ఫ్యాట్ - 4.75గ్రా, ఫైబర్-0 గ్రా.
రాజస్థాన్
రాజస్థాన్‌లో ఈ బూందీ రైతాకు చాలా పాపులారిటీ ఉంది. ఇంతకు ముందు చెప్పనట్లే ఉత్తర భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెరుగు చట్నీకి బదులుగా ఈ బూందీ రైతాను అన్నంలో తింటారు. దీనిని అక్కడ చాలా మంది చపాతీలో, అలాగే తినడం కూడా చేస్తారు. మార్వాడీ వేడుకల్లో బూందీ రైతా లేనిదే వారి వంటలు పూర్తి కావంటే ఈ బూందీ రైతాకు ఉన్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
