Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బ్రౌన్ రైస్ దోశ.. దీంతో బ్రౌన్ రైస్ అంటే బోర్ కొట్టదు..!!
దోశకు చాలా పెద్ద చరిత్రే ఉంది. రుగ్వేద కాలం నుంచే దోశలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల దోశలు వచ్చాయ్. దోశలను ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలోనే చేసుకుంటాం. అయితే ఈ దోశలను బ్రౌన్ రైస్‌తో వేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేశారు. బ్రౌన్ రైస్‌ను షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈ బ్రౌన్ రైస్‌తో దోశలు చేసుకుంటే పోషకాలతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ బ్రౌన్ రైస్ దోశను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బ్రౌన్ రైస్ దోశ తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్ధాలు ఇవే
బ్రౌన్ రైస్ - 1 కప్పు
ఉల్లిపాయ - 1 (బాగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చి మినప్పప్పు - 1/2 కప్పు
మెంతి గింజలు - 1/2 టీస్పూన్
నూనె - అవసరమైనంత
ఉప్పు - రుచికి తగినంత
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం ముక్క
బ్రౌన్ రైస్ దోశ తయారు చేసుకునే విధానం :
1. ముందుగా బ్రౌన్ రైస్, పచ్చి మినప్పప్పును శుభ్రంగా కడిగి, వాటిని నీళ్లలో 6-8 గంటలు రాత్రంతా నానబెట్టాలి. అలాగే, మెంతి గింజలను కూడా నానబెట్టుకోవాలి.
2. మిర్చి, అల్లంను చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
నానబెట్టిన తరువాత, రైస్, పప్పు, మెంతి గింజలు, పచ్చిమిర్చి, అల్లంను
మిక్సీ గ్రైండర్ లేదా బ్లెండర్‌లో వేసి, తగినంత నీళ్లు పోసి,
మెత్తగా రుబ్బుకోవాలి.
3. కలుపుకున్న పిండి గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా దోశలు వేసుకునే విధంగా కలుపుకోవాలి. పిండిని బౌల్‌లో తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక గంట పాటు ఈ పిండిని పక్కన పెడితే కొంచెం పొంగుకొని వస్తుంది.
4. ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని నూనె రాసి వేడి అయిన తరువాత కలుపుకున్న పిండితో దోశలు వేసుకోవాలి. దానిపై కొంచెం నూనె రాసి, రెండు వైపులా దోశను తిప్పుకోవాలి. దోశ రెండు వైపులా బాగా కాలేలా చూసుకోవాలి.
5. ఇలాగే పిండిని మొత్తం దోశలుగా వేసుకోవాలి. కొబ్బరి చట్నీ, లేదంటే అల్లం చట్నీతో ఈ దోశలను సర్వ్ చేసుకోవచ్చు. చాయ్‌తో నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇది బ్రౌన్ రైస్‌తో చేసిన దోశలు కాబట్టి ఇందులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయ్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications