Latest Updates
-
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది -
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే! -
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో..
Chicken cutlet: క్రిస్మస్ స్పెషల్ చికెన్ కట్‌లెట్.. రుచి ఎంత చెప్పినా తక్కువే, ఎలా చేసుకోవాలో తెలుసా?
చికెన్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఎంత పెట్టినా తినే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతో రుచికరమైన ఈ చికెన్‌తో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. అందులో ఒకటే ఈ చికెన్ కట్‌లెట్. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కరకరలాడుతూ అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. అసలు ఈ చికెన్ కట్లెట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- అరకిలో చికెన్
- రెండు బంగాళాదుంపలు
- రెండు టేబుల్ స్పూన్ల నూనె
- ఒక ఉల్లిపాయ
- ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- నాలుగు పచ్చిమిర్చి
- కొన్ని కరివేపాకులు
- అర టేబుల్ స్పూన్ పసుపు
- ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి
- ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా
- రుచికి సరిపడా ఉప్పు
- ఒకటి ఎగ్ వైట్
- బ్రెడ్ క్రంబ్ ఒకటి
చికెన్ కట్లెట్ తయారీ విధానం
ఈ చికెన్ కట్లెట్ తయారు చేసుకోవడానికి ఉండు ఒక గిన్నెలో రెండు బంగాళదుంపలను బాగా ఉడకబెట్టుకొని, పొట్టు తీసి గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరోవైపు చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ మెత్తగా ఉండేటట్లు ఉడకబెట్టుకొవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి. అలాగే రెండు టీస్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అలాగే అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసిపెట్టుకున్న పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తరువాత గుప్పెడు కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని పచ్చి వాసనా పోయేంత వరకు వేయించుకోవాలి.
ఆ తరువాత అందులో మెత్తగా చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి. ఆ బంగాళాదుంపలోని నీరు పోయేంత వరకు సన్నటి మంటపైనే వాటిని వేయించుకోవాలి. ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని స్టవ్ బంద్ చేయాలి. ఆ గుజ్జును చిన్న చిన్న బాల్స్ మాదిరిగా అయినా వేసుకోవచ్చు లేదా మీకు ఇష్టం వచ్చిన షేప్‌లో పెట్టుకోవచ్చు.
అలా చేసుకున్న వాటిని ఎగ్ వైట్‌లో ముంచి బ్రెడ్ క్రంబ్‌లో ముంచి పక్కన పెట్టుకోవాలి. అలా అన్ని ముక్కలకు బ్రెడ్ క్రంబ్ అంటించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిపై నూనె పోసి, వేడయ్యాక చికెన్ ముక్కలను బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే ఎంతో రుచికరమైన కరకరలాడే చికెన్ కట్లెట్ సిద్ధమైపోయినట్లే. దీనికి టమేటా సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే రుచి నెక్స్ట్ లెవెల్ అంతే. మీరూ ఓసారి ట్రై చేయండి మరి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












