Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
కోడి గుండెకాయల ఫ్రై,మీరెప్పుడూ తినని వంట.. రుచి ఆహా అనేలా ఉంటుంది, ఎలా చేసుకోవాలంటే?
చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారు. అందులో కూరలు, ఫ్రైలు ఇలా చాలానే ఉంటాయి. అయితే మీరెప్పుడైనా కోడి గుండెకాయ తిన్నారా? కొందరు దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఈ స్టోరీలో కోడి గుండెతో 65 ఫ్రై ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కోడి గుండెకాయలతో ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
పావుకిలో కోడి గుండెకాయలు
ఫ్రై చేయడానికి సరిపడా నూనె
రెండు చెంచాల కారం
ఒక చెంచా పసుపు
రుచికి సరిపడా ఉప్పు
రెండు పచ్చిమిర్చి
కొద్దిగా కరివేపాకు
గరం మసాలా
మిరియాల పొడి
ధనియాల పొడి
ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒక కోడి గుడ్డు
కార్న్ ఫ్లోర్

కోడి గుండెకాయలతో ఫ్రై తయారీ విధానం
ఈ కోడి గుండెకాయలతో ఫ్రై చేసుకోవడం చాలా సులభం. అందుకోసం ముందుగా కోడి గుండెకాయలు తీసుకోవాలి. వాటిని కత్తెరతో మధ్యలో నుంచి చీల్చి.. శుభ్రంగా కడుక్కొని ఓ ప్లేట్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఆ కోడి గుండెకాయలపై రెండు చెంచాల కారం, ఒక చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ మసాలాలు అంతా ఆ గుండెకాయలకు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. అనంతరం అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక గుడ్డు పగలగొట్టుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిపై గుండెకాయలను ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి. అందులో మనం ముందుగా మసాలాలు దట్టించి పెట్టుకున్న కోడి గుండెకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేశాక.. ఆ నూనెలోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, గుండెకాయలపై పెట్టుకుంటే ఎంతో రుచికరమైన, అలాగే అద్భుతమైన కోడి గుండెకాయలా 65 సిద్ధమైనట్లే. మీరూ ఓసారి దీనిని ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
