Latest Updates
-
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.!
Chicken Popcorn: క్రిస్పీగా చికెన్ పాప్ కార్న్ ఇలా చేసుకోండి.. హోటల్‌లో వాటికన్నా రుచి అద్భుతంగా ఉంటుంది
నాన్ వెజ్ వంటకాలు ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. అందులోనూ అందరికీ అందుబాటులో ఉండే చికెన్ వంటలు ప్రతిఒక్కరూ లొట్టలేసుకుని తింటూ ఉంటారు. అందులో ఒకటి చికెన్ పాప్ కార్న్. ఇది పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది. చాలా క్రిస్పీగా, ఎంతో రుచికరంగా ఉండే ఈ చికెన్ పాప్ కార్న్ తినాలంటే కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంది. అదే ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చులో చికెన్ పాప్ కార్న్ సిద్ధమవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఈ చికెన్ పాప్ కార్న్ ఎలా చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్ పాప్ కార్న్ కోసం కావాల్సిన పదార్థాలు
- అరకిలో బోన్ లెస్ చికెన్ ముక్కలు
- నాలుగు బ్రెడ్ ముక్కలు
- పావు కప్పు మైదా
- ఒక స్పూన్ కారం
- రెండు స్పూన్ కార్న్ పౌడర్
- ఒకటిన్నర స్పూన్ నిమ్మరసం
- ఒక స్పూన్ చిల్లి ఫ్లేక్
- రుచికి సరిపడా ఉప్పు
- అర స్పూన్ మిరియాల పొడి
- డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె

చికెన్ పాప్ కార్న్ తయారీ విధానం
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చిన చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, చిల్లి ఫ్లేక్స్, నిమ్మరసం, కొద్దిగా సోయాసాస్, కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో చికెన్ ముక్కలు కూడా వేసుకొని.. ఆ మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. చివర్లో ఒక గుడ్డు కూడా పగలగొట్టుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అనంతరం ఒక అరగంట పాటు ఆ చికెన్ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టాలి. అలా చేయడం ద్వారా మసాలా అంతా చికెన్ ముక్కలకు బాగా అంటుకుంటుంది.
ఇప్పుడు నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని.. మిక్సీలో వేసుకొని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో పావు కప్పు మైదా, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, అందులో చికెన్ పాప్ కార్న్ డీప్ ఫ్రై అవ్వడానికి కావాల్సిన నూనెను పోసుకొని.. బాగా వేడి చేసుకోవాలి. అనంతరం ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ ముక్కలను తీసుకొని.. బ్రెడ్ మిశ్రమంలో బాగా అటూ ఇటూ దొర్లించాలి.
ఆలోపు నూనె వేడిక్కితే అందులో చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు లేత బంగారు రంగులో వచ్చేంతవరకు వేయించుకోవాలి. అప్పుడే పాప్ కార్న్ సరిగ్గా ఉడుకుతుంది. అనంతరం ఆ ముక్కలను బయట తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అలా చేస్తే చికెన్ ముక్కల్లో ఉండే నూనెను టిష్యూ పీల్చేస్తుంది. ఇలా అన్ని ముక్కలను ఫ్రై చేసుకుంటే.. చికెన్ పాప్ కార్న్ సిద్ధమైపోతుంది. వీటిని ఎంచక్కా కెచప్ లో నంజుకొని తినేయడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
