Latest Updates
-
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్స్టిక్తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ!
Coconut rice: లంచ్ లోకి రుచికరమైన కోకోనట్ రైస్..ఈజీగా ఎలా చేయాలో చూడండి
మన దేశంలోని ఏ ప్రాంతంలో అయినా సరే మధ్నాహ్నా సమయంలో ఆహారంగా చాలామంది అన్నం తినడానే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే రోజూ ఒకేరకమైన వంటకాలతో చాలామందికి విసుగొస్తుంటది. కాబట్టి కొత్త రుచులను ఆస్వాదించాలని కోరుకుంటుంటారు. అందుకే ఏదైనా కొత్తగా చేసిపెట్టండని ఇంట్లోవాళ్లని అడుగుతుంటారు. అయితే మధ్నాహ్నా సమయంలో తినడానికి కొత్తగా,ప్రత్యేకమైన వంటకాన్ని ట్రై చేయాలనుకుంటే మాత్రం కొబ్బరి అన్నం లేదా కోకోనట్ రైస్ బెస్ట్ ఆప్షన్. సౌత్ ఇండియన్ ఫ్లేవర్‌తో నిండిన ఈ వంటకం చాలా రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా.
ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. పోషకాహారం అధికంగా ఉండే ఈ వంటకాన్ని రెడీ ఒక్కసారి కుటుంబ సభ్యులకు పెట్టారంటే మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది మరి. అయితే రుచికరమైన కోకోనట్ రైస్ ఎలా తయారు చేయాలో స్టైప్ బై స్టైప్ చూద్దాం.

కోకోనట్ రైస్ తయారీకి కావాల్సినవి
జీలకర్ర-1 టేబుల్ స్పూన్
ఆవాలు-1 స్పూన్
శనగపప్పు-1 చెంచా
నెయ్యి-1 టేబుల్ స్పూన్
జీడిపప్పు-తగినంత
మినపప్పు- 1 టీస్పూన్
ఎండు మిర్చి-2
కరివేపాకులు-రెండు రెబ్బలు
తరిగిన పచ్చి మిర్చి-2
తరిగిన అల్లం-తగినంత
తురిమిన కొబ్బరి-1/2 కప్పు
వండిన అన్నం-1 కప్పు
తయారీ విధానం
-ముందుగా బాండీలో ముందుగా బాణలిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి
చేయాలి.
-తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
-అదే బాండీలో ఇప్పుడు 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ఆవాలు, 1
టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసి
వేయించాలి. వీటన్నింటినీ ముదురు రంగు వచ్చే వరకు వేయించాలి.
-ఇప్పుడు కరివేపాకు,తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. కావాలనుకుంటే మీ
టేస్ట్ కి అనుగుణంగా తరిగిన అల్లం కూడా కలుపుకోవచ్చు. వీటన్నింటిని
బాగా వేయించాలి.
-ఇప్పుడు 1/2 కప్పు తురిమిన కొబ్బరి, రుచికి తగినంత ఉప్పు వేయాలి.
దీన్ని బాగా మిక్స్ చేసి చివరగా 1 కప్పు ఉడికించిన అన్నం వేసి బాగా
కలపాలి.
-ఇప్పుడు నెయ్యిలో వేయించి ఉంచిన జీడిపప్పు వేస్తే రుచికరమైన కోకోనట్
రైస్ తినడానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
