Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్..కాలీఫ్లవర్ బఠానీ కుర్మా!
సాధారణంగా చపాతీ అనగానే మనకు గుర్తొచ్చేది బంగాళాదుంప కుర్మా లేదా చికెన్ కర్రీ. కానీ ఎప్పుడూ ఇవే కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా, అంతకు మించిన రుచితో కొత్త వంటకాన్ని ప్రయత్నించండి. మీ ఇంట్లో కాలీఫ్లవర్, తాజా పచ్చి బఠానీలు ఉన్నాయా? ఈ రెండింటి కాంబినేషన్లో చేసే కుర్మా రెస్టారెంట్ రుచిని తలపిస్తుంది.
ఈ స్టైల్ లో కుర్మా చేస్తే, ఇంట్లో వాళ్ళు సాధారణంగా తినే దానికంటే మరో రెండు చపాతీలు ఎక్కువే లాగిస్తారు. నోరూరించే కాలీఫ్లవర్ పీస్ కుర్మా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ - 250 గ్రాములు
పచ్చి బఠానీలు - అర కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
యాలకులు - 1
దాల్చిన చెక్క - 1
చిన్న ముక్క, లవంగాలు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
టమోటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా
పచ్చి కొబ్బరి తురుము - 1 గుప్పెడు
పుదీనా ఆకులు - కొద్దిగా
పచ్చిమిర్చి - 2
గసగసాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా కాలీఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి, కాలీఫ్లవర్ ముక్కలను 5 నిమిషాల పాటు నానబెట్టాలి.
-మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, పుదీనా, 2 పచ్చిమిర్చి, గసగసాలు, సోంపు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కాక యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించండి. ఆ మసాలా ఘుమఘుమలు రాగానే, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత తరిగిన టమోటా ముక్కలు వేసి, అవి మెత్తగా గుజ్జులా అయ్యే వరకు మగ్గనివ్వాలి.
-టమోటా మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి.
-తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి, మూత పెట్టి కూరగాయలను బాగా ఉడికించుకోవాలి.
-కూరగాయలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్ ను ఇందులో వేయాలి. ఇందులోనే గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలపాలి.
-మంటను మీడియంలో పెట్టి మరో 3-4 నిమిషాల పాటు ఉడికించండి. నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ బఠానీ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications