రుచికరమైన డబుల్ కా మీఠా.. చేయడం చాలా ఈజీ..

Posted By:

డబుల్ కమీఠా అనగానే నోట్లో లాలాజలం పొంగివస్తుంది. ఈ స్వీట్‌ను ఇష్టపడని వారుండరు. హైదరబాద్‌లో డబుల్ కమీఠా చాలా ఫేమస్. పెళ్లి వేడుకల్లో కూడా డబుల్ కమీఠా ఉంటే ఇక ఆ స్వీట్ వెంటనే అయిపోవాల్సిందే. ఇంట్లోనే నోరూరించే డబుల్ కమీఠాను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

how to make double ka meetha in telugu at home double ka meetha recipe ingredients how to make double kameetha easy

బ్రెడ్ కటింగ్

డబుల్ కా మీఠా మరింత టేస్టీగా రావాలంటే అందులో వాడే ఇంగ్రీడియంట్లను కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మిస్క్ బ్రెడ్‌తో ఈ స్వీట్ మరింత రుచికరంగా మారుతుంది. ఆరు బ్రెడ్ స్లైసులను తీసుకొని వాటి కొనలో ఉన్న బ్రౌన్ పార్ట్‌ను కత్తితో కట్ చేసేయాలి. తరువాత ఆ బ్రెడ్ ముక్కలను ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలి కింద గంట సేపటివరకు అలాగే ఉంచాలి. దీని వల్ల బ్రెడ్ గట్టిపడుతుంది.

క్రీమ్ పాలు

అర లీటరు ఫుల్ క్రీమ్ పాలను తీసుకొని ప్యాన్‌లో బాగా మరిగించాలి. పాలను 10 నిమిషాలపాటు బాగా మరిగి చిక్కగా అయ్యేలా చూసుకోవాలి. పాలు మరుగుతుండగానే మూడు చెంచాల బాదాం ముక్కులను, పిస్తా ముక్కలను అదే పాలల్లో వేసే మరుగుతుండానే కలుపుతుండాలి. చిక్కగా అయిన తరువాత ప్యాన్‌ను పక్కకు దింపుకోవాలి.

బ్రెడ్ ఫ్రై

బ్రెడ్ ముక్కలను ఫ్రై చేయడానికి మరో ప్యాన్‌ను తీసుకొని అందులో 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొంచం మరిగిన తరువాత రెండు స్పూన్ల కాజు, రెండు స్పూన్ల కిస్‌మిస్ వేసి బ్రౌన్ అయ్యేంతవరకు ఫ్రైచేసుకోవాలి. వెంటనే కాజు, కిస్మిస్‌ను ప్యాన్‌లో నుంచి బయటకు తీసి అదే ప్యాన్‌లో బ్రెడ్ ముక్కలను వేసి ఫ్రై చేయాలి.

షుగర్ సిరప్

డబుల్ కమీఠా షుగర్ సిరప్ కోసం అర కప్పు షుగర్‌ను ప్యాన్‌లోకి తీసుకోవాలి. అందులో అరకప్పు నీళ్లు పోసి, చిటికెడు కుంకుమ పువ్వు వేసి బాగా మరిగించుకోవాలి. చిటికెడు యాలాకుల పొడి కూడా వేస్తే బాగుంటుంది. సిరప్ చిక్కగా స్టిక్కీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అప్పుడు ఫై చేసిన బ్రెడ్ ముక్కలను అదే ప్యాన్‌లో ఉన్న షుగర్ సిరప్‌లో వేయాలి ఒక్కొక్కటిగా వేసి సిరప్‌లో బ్రెడ్ మొత్తం నానేలా చూసుకోవాలి. తరువాత అంతకు ముందు తయారు చేసుకున్న పాల రబడీని ఇందులో బ్రెడ్ పైనే వేసుకొని స్టవ్ చిన్నగా చేసుకొని స్లోగా కలుపుకోవాలి.

సిరప్ మొత్తం అయిపోయే లాగా మంట ఎక్కువగా పెట్టకుండా తక్కువ మంటపై ఉడికించాలి. కొంత చల్లారిన తరువాత అదే బ్రెడ్‌పై వేయించిన కాజు, కిస్‌మిస్‌లను చల్లాలి. దీంతో ఇక మన ఫేవరెట్ డబుల్ కా మీఠా స్వీట్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, April 17, 2024, 17:05 [IST]
Desktop Bottom Promotion