Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
నోరూరించే ఎగ్ బిర్యానీ.. చేయడం చాలా సింపుల్..!
ఇంట్లోనే ఎగ్ బిర్యానిని చేసుకోని తింటే అందులో వుండే ఆనందమే వేరు. బయట రెస్టారెంట్ లల్లో ఎగ్ బిర్యానీ టేస్ట్ వచ్చేలా చేసుకోవొచ్చు. ఎగ్ బిర్యానీ నీ ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక ప్యాన్ లో గుడ్లని ఉడికించిడానికి వాటర్ ని నిండుగా పోసుకొని, ఆరు నుంచి ఏడు గుడ్లని కడిగి అందులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గుడ్లు బాగా ఉడికే వరకు అలాగే ఉంచాలి. ఈ మధ్యలో ఒక బౌల్ లో ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని ముందుగా బాగా కడగాలి. ఇప్పుడు బియ్యంలో కొన్ని నీళ్లు పోసి 30 నిమిషాల వరకు నానబెట్టాలి.
గుడ్లు బాగా ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి. గుడ్లు ఉడికితే ఆ ప్యాన్ ను కిందకు దించివేయాలి. తరువాత ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసుకోవాలి అందుకే ఒక మీడియం సైజు వున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి. దాంట్లో నే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి. ఉల్లిపాయ కొంత ఫ్రై అయిన తరువాత ఒక కప్ టమాట ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఒక మూడు నిమిషాలవరకు కడాయి లో వున్న దాన్ని మొత్తం కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి కడాయిలో వున్నది చాల్లారిన తరువాత దాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేయాలి.

ఇప్పుడు ఖాళీ కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల మంచినూనె వేసుకొని, అర టీస్పూన్ కారం, తగినంత ఉప్పు, అర టీస్పూన్ పసుపును వేసుకోవాలి. దీన్ని నూనెలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికిన గుడ్లకు గాట్లు పెట్టుకొని ఒక్కొక్క గుడ్డును ప్యాన్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇంతకు ముందు మిక్సిలోకి తీసుకున్న టమాటా ఉల్లిపాయల్లో నాలుగు పచ్చి మిరపకాయలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎగ్ బిర్యానీని కలపడానికి ఒక ప్యాన్ ను తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని, రెండు టేబుల్ స్పూన్ల మంచినూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడయిన తరువాత అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వచ్చేంతవరకూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి సగం ఉల్లిపాయ లను పక్కకు తీసుకోవాలి.
బగారా కోసం వేసే స్పైసస్ అన్నింటిని ఇప్పటీ గనం ఫ్రై అవుతున్న ప్యాన్‌లోకి తీసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వుండేలా చూసుకోవాలి. సాజీరా, జిలకర కూడా వేసుకోవాలి. టమాట ఉల్లిపాయ పేస్టుకూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో అర కప్పు పెరుగును వేసుకొని మంట లో ఫ్లేమ్‌లో పెట్టి. తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆర టీస్పూన్ గరం మసాలా పొడి , ఒక టీస్పూన్ బిర్యానీ మసాలా తీసుకొని మాడిపోకుండా బాగా కలపాలి. ఇందులో కొద్దిగా పూదీని, కొత్తిమీర ఆకును వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో నానిన బాస్మతీ రైస్‌ను వేసుకొని కలుపుకోవాలి. ఒక ముప్పావు గ్లాసు నీళ్లను కూడా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం స్లోగా కలుపుతూ ఉడికించాలి. రైస్ ఉడికేంత వరకు ఇలా చేయాలి. మొత్తం బిర్యానీలో నీళ్లు లేకుండా ఉడికేంత వరకు చూసుకోవాలి. ఇంతకు ముందు పక్కను తీసుకున్న ఉల్లిపాయ ఫ్రై ని రైస్ పైన చల్లి, కొంత కొత్త మీరను కూడా చల్లాలి. ఫ్రై చేసుకున్న గుడ్లను రైస్ పై పెట్టాలి. ఇప్పుడు ప్యాన్‌ను మూత పెట్టి 10 నిమిషాల స్టవ్‌పై చిన్న ఫ్లేమ్‌పై పెట్టాలి. పది నిమిషాల తరువాత మూత తీసి చూస్తే రెడీ అయిన బిర్యానీని చూడవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications