Latest Updates
-
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.!
ఎన్నో చికెన్ వంటకాల్లో..హరియాలీ చికెన్ వేరయా..!
చికెన్‌లో ఎన్ని వెరైటీలు వున్నాయో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. నాన్‌వెజ్‌లో చికెన్‌లో వున్న వంటరకాలు బహుశా ఏ నాన్‌వెజ్‌లో లేవనుకుంటా. వందల చికెన్ రెసిపీల్లో ఇప్పుడు మీకు హరియాలీ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. మామూలు చికెన్ కర్రీ కాకుండా ఈ వీకెండ్‌లో ఈ హరియాలీ చికెన్‌ను ట్రై చేయండి.

హరియాలీ చికెన్‌కు కావాల్సిన పదార్ధాలు
1/2 కేజీ చికెన్
1 కప్పు ఉల్లిపాయలు
దాల్చిన చెక్క, 6 లవంగాలు, 5 యాలాకులు
4 టేబుల్ స్పూన్ల మంచి నూనె
1 బిర్యానీ ఆకు
1/2 టీస్పూన్ జిలుకర
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
1/4 టీస్పూన్ పసుపు
1 టీ స్పూన్ కారంపొడి
1/2 టీ స్పూన్ మిరియాల పొడి
1 టీ స్పూన్ గరం మసాలా
రుచికి తగినంత ఉప్పు
1/2 కప్పు పెరుగు
1 కప్పు కొత్తిమీర
1 కప్పు పూదీన
5 పచ్చిమిరపకాయలు
1 టీ స్పూన్ ధనియాల పొడి
1/2 టీస్పూన్ జిలుకర పొడి
కొత్తి మీర ఆకులు

హరియాలీ చికెన్ తయారీ విధానం
1. ముందుగా అర కేజీ చెకెన్‌ను బౌల్‌లో తీసుకొని బాగా కడగాలి.
2. మిక్సీ గ్రైండ్‌లో 1 కప్పు ఉల్లిపాయలను, దాల్చిన చెక్క, 6 లవంగాలు, 5 యాలాకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
3. ఒక ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్ల మంచి నూనెను తీసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, అర టీస్పూన్ జిలుకరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
4. నూనెలో గ్రైండ్ చేసిన ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును యాడ్ చేసుకోవాలి.
5. ఇందులోనే కడిగిన చికెన్‌ను వేసుకొని బాగా కలపాలి.
6. 5 నిమిశాలు ఫ్రై చేసిన తరువాత పావు టీస్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారంపొడిని యాడ్ చేసుకోవాలి. అర టీస్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి.
7. అరకప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ను బాగా కలుపాలి.
8. ప్యాన్‌పై మూత పెట్టి 6 నిమిశాలు లోఫ్లేమ్‌లో ఉడికించాలి.
9. మిక్సీ గ్రైండర్‌లో 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పూదీన ఆకులను, 5 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి.
10. ఉడుకుతున్న చికెన్‌లో గ్రైండ్ చేసిన కొత్తిమీరపేస్టును వేసుకోవాలి.
11. చికెన్‌ను బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిశాల వరకు ఉడికించాలి.
12. కూరలో గ్రేవీ కోసం కొన్ని నీళ్లను యాడ్ చేసుకోవాలి.
13. చికెన్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టి మెత్తగా ఉడికేంత వరకు చూసుకోవాలి.
14. చికెన్ మాడిపోకుండా జాగ్రత్త పడాలి.
15. 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జిలుకర పొడిని, కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని కలుపుకోవాలి.
16. కొన్ని నిమిశాలు ఉడికిస్తే ఇక హరియాలీ చికెన్ రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
