Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
Nethi Bobbatlu: నేతి బొబ్బట్లు..ఇలా చేస్తే స్వీట్ షాపు టేస్ట్ కన్నా అదిరిపోతుంది
పండుగా అయినా,పెళ్లి అయినా లేదా మరేదైనా పంక్షన్ అయినా చాలామంది నేతి బొబ్బట్లు(neti bobbatlu) వడ్డిస్తుంటారు. ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే కరిపోయేలా ఉండే నేతి బొబ్బట్టుని మీరు మీ ఇంట్లోకూడా సింపుల్ గా చేసుకోవచ్చు. దీని తయారీకి కూడా పెద్ద కష్టపడనక్కర్లేదు. అయితే ఎలా పడితే అలా చేస్తే టేస్ట్ రాదు కాబట్టి ఇక్కడ చెప్పబడిన విధంగా నేతి బొట్టట్లు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. కాబట్టి నేతి బొబ్బట్లు తయారీకి ఏం కావాలి,తయారీ ప్రక్రియ ఎలా అనేది ఇఫ్పడు చూద్దాం.
నేతి బొబ్బట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
-శెనగపప్పు
-ఉప్పు
-తురిమిన బెల్లం
-గోధుమపిండి
-మైదాపిండి
-నెయ్యి
-యాలకుల పొడి
-నెయ్యి
-నీరు

-1 కప్పు శెనగపప్పు తీసుకొని దానిని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక గంట సేపు నానబెట్టిండి.
-తర్వాత నీళ్లు అన్నీ ఒంపేసీ ఆ శనగప్పుని కుక్కర్ ని వేయండి.
-ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నీళ్లు,పావు టీ స్పూన్ పసుపు,చిటికెడు ఉప్పు,ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూతపెట్టండి.
-3-4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించండి.
-పప్పు ఉడికేలోపు ఓ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు మైదా పిండి,అరకప్పు గోధుమ పిండి,2 టేబుల్ స్పూన్ల నెయ్యి,చిటికెడు ఉప్పు,పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలిసేలా కలపండి.
-ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ సాఫ్ట్ చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి.
-తర్వాత దాని మీద ఇంకెంచం నెయ్యి వేసి దానిని ఓ పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు కుక్కర్ మూత తీసి అందులో ఉండే నీళ్లని బాగా వడకట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీలో ఆ పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఓ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ నెయ్యి,శనగపప్పు కొలిచిన అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి మీడియం మంట మీద కలుపుతూ బాగా కరిగించండి.
-బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులో గ్రైండ్ చేసిన పప్పు వేసి బాగా కలపండి. బెల్లం పాకం పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి.
-ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి,అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలపండి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-ఈ పూర్ణం మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోని ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు ముందుగా కలిపిపెట్టుకున్న మైదా,గోధుమ పిండి మిశ్రమాన్ని మళ్లీ ఓ సారి కలిపి ఉండలుగా తీసుకోండి. ఇప్పుడు పిండి ముద్దను స్ప్రెడ్ చేసి అందులో పూర్ణం ఉండ తీసుకొని క్లోజ్ చేసి పూర్ణం బయటకు రాకుండా మళ్లీ స్ప్రెడ్ చేయండి. ఇలా చేసటప్పుడు దాని ముందు వెనుక నెయ్యి వేస్తూ ఉండండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ ని బాగా వేడి చేయండి. పాన్ బాగా వేడయ్యాక బొబ్బట్టుని దానిమీద వేసి 5 నుంచి 10 సెకన్లు కాల్చండి. రెండో వైపు కూడా అలానే కాల్చండి.
-కొంచెం కాలిన తర్వాత రెండు వైపులా నెయ్యి పోస్తూ బాగా కాల్చండి. టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications