Latest Updates
-
చలికాలంలో షుగర్ పేషంట్లు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం తినాలి? -
డయాబెటిస్ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే! షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా? -
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు! -
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా!
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ బంగాళదుంప మోమోలు.. తక్కువ పదార్థాలతో సులభంగా చేసేయండిలా..
గతంలో నార్త్ ఇండియాలో ఉదయం, సాయంత్రం సమయాల్లో మోమోలు ఎక్కువగా తింటుండేవాళ్లు..అయితే ఇప్పుడు సౌతిండియాలో కూడా వీటిని ఎక్కువగా తింటున్నారు. నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో మోమోలు తయారుచేసి అమ్ముతున్నారు. ఇళ్లల్లో కూడా వీటిని తరచుగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా చలికాలంలొ వేడి వేడి మోమోలు తింటుంటే ఆ మజానే వేరు.
సాధారణంగా బయట మార్కెట్లో వెజిటేరియన్, పనీర్, చికెన్ మోమోలు విరివిగా దొరుకుతుంటాయి. కానీ ఎప్పుడూ ఒకే రకమైన మోమోలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఇంట్లోనే చాలా విభిన్నంగా, కొత్త రుచితో బంగాళదుంప మోమోలను(పొటాటో మోమోస్) ప్రయత్నించి చూడండి. ఇవి తినడానికి ఎంత రుచిగా ఉంటాయో, ఇంట్లో తయారు చేయడం కూడా అంతే సులభం. పొటాటో మోమోలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మైదా పిండి: 2 కప్పులు
బేకింగ్ పౌడర్: అర టీస్పూన్
ఉప్పు: అర టీస్పూన్, రుచికి సరిపడా ఫిల్లింగ్ లోకి
ఉడికించిన బంగాళదుంపలు: 5
వెల్లుల్లి ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు
వెన్న: 1 టేబుల్ స్పూన్
నల్ల మిరియాల పొడి: 2 టీస్పూన్లు
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు!
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మైదా పిండి, అర టీస్పూన్ ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కాస్త గట్టిగా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిపై మూత పెట్టి కాసేపు పక్కన ఉంచండి.
-మరో గిన్నెలో ఉడికించిన బంగాళదుంపలను తీసుకుని ఉండలు లేకుండా మెత్తగా మాష్ చేయాలి. ఇందులో తరిగిన వెల్లుల్లి, నల్ల మిరియాల పొడి, వెన్న, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయాలి. అంతే, ఘుమఘుమలాడే మోమో ఫిల్లింగ్ రెడీ.
-ఇప్పుడు నానిన పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను పల్చటి చపాతీలా, దాదాపు 4 నుంచి 5 అంగుళాల గుండ్రటి ఆకారంలో ఒత్తుకోవాలి. ప్రతి గుండ్రటి ముక్క మధ్యలో కొద్దిగా బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచాలి. అంచులకు కొద్దిగా నీరు రాసి, గట్టిగా మూసివేయాలి. ఇలా చేయడం వల్ల మోమోలకు చక్కని ఆకారం రావడమే కాకుండా ఉడికేటప్పుడు విడిపోకుండా ఉంటాయి.
-చివరగా ఒక స్టీమర్ లో నీటిని వేడి చేసి, అందులో మోమోలను ఉంచి సుమారు 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. మోమోలు చక్కగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని, సోయా సాస్, చిల్లీ సాస్ లేదా మోమో చట్నీతో వేడివేడిగా వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
