Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రాగి సంగటిని వారానికి ఒక్కసారైనా తిందాం.. చేయడం చాలా సింపుల్..!
రాగి సంగటి ఈ కాలంలో తినడం చాలా అరుదుగా అయిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు చాలా మంది తమ ఇళ్లల్లో రాగి సంగటిని చేసుకొని తినేవారు. రాగిసంగటికి కాంబెనేషన్‌గా ఏ కూరనైను తీసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను కూడా రాగిసంగటిలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మారిన జీవన విధానంలో ప్రతీ రోజు రాగిసంగటిని తినడానికి చాలా మంది ఇష్టపడ్డం లేదు. కనీసం వారానికి ఒకసరైనా రాగిముద్దను తినడం అలవాటు చేసుకోవాలి.
రాగి సంగటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు. ఐరన్ కంటెంట్ కూడా సంమృద్ధిగా వుంటుంది. ఈ ఎండాకాలంలో రాగి జావ, లేదంటే రాగి సంగటి తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా వుంటుంది. ప్రతీ రోజు ఒక గ్లాసు రాగి జావ తాగితే శరీరం చలవగా ఉండడం వల్ల వడదెబ్బను తట్టుకునే శక్తి వుంటుంది.

ముందుగా అర కప్పు బియ్యాన్ని ఒక బౌల్ లో తీసుకోవాలి. బియ్యాన్ని బాగా కడగాలి. అందులో కొన్ని నీళ్లు పోసి 1 గంట వరకు బియ్యాన్ని నానబట్టాలి. తరువాత ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి. స్టవ్ వపై ఒక ప్యాన్‌లో ఒక కప్పు నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి. నీళ్లు కాగిన తరువాత అందులో నానబెట్టుకున్న రైస్‌ను యాడ్ చేసుకోవాలి. రైస్ ను ఉడికేంత వరకు చూసుకోవాలి. రైస్ మొత్తం అన్నంగా మారకముందు ఇంతకు ముందు తీసుకున్న రాగిపిండిని ఇందులో వేసుకోవాలి. రాగి పిండిని వేసిన తరువాత కలపకుండా అలాగే వుంచాలి. ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉడికిన తరువాత మూత తీసి గరిటతో మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు రైస్, రాగి రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఉండలు కాకుండా ఉండడానికి బాగా కలుపుతూనే వుండాలి. ప్యాన్‌ను స్టవ్ పై నుంచి కిందకు దింపుకోవాలి.
రాగి ముద్దలు చేసుకోవాడానికి అరచేయికి కొంత నెయ్యిని రాసుకోవాలి. నెయ్యికి బదులుగా నీళ్లకు కూడా రాసుకోవచ్చు. చేతికి అతుక్కోకుండా రాగి ముద్ద ఇంకా బాగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఒక పిడికెడు రాగి ముద్దను తీసుకొని దాన్ని లడ్డూల్లా చేసుకోవాలి. దీంతో రాగి సంగటి తయారైనట్టే.
రాగి సంగటికి కాంబినేషన్‌గా నాటుకోడి పులుసు లేదా..
రాగి సంగటిని అలాగే తినవచ్చు. సమయం వుంటే మాంసాహారులైతే నాటుకోడిపులుసు చేసుకొని దాంట్లో నంచుకొని తినవచ్చు. చాలా మంది రాగిసంగటిని నాటుకోడిపులుసుతో తినడానికి ఇష్టపడతారు. మాంసం తినని శాఖాహారులైతే ఏదైనా కూరగాయల రసం, పప్పుతో తినవచ్చు.
రాగిసంగటిలో పోషకాలు
రాగిసంగటిలో క్యాల్షియం సంమృద్ధిగా వుంటుంది. ఇది ఖనిజాల భాండాగారమని చెప్పుకోవచ్చు. కేవలం 100 గ్రాముల రాగిలోనే సుమారు 350 నుంచి 400ల క్యాలరీలు వుంటాయ్. క్యాల్షియం 26 శాతం, పొటాషియం 27 శాతం, ఫైబర్ 14 శాతం, ప్రొటీన్ 10 శాతం వరకు వుంటుంది. గర్భిణులు డెలివరీ తరువాత పాలను ఉత్పత్తి చేయడానికి ఈ రాగి చాలా దోహదపడుతుంది. హెమోగ్లోబిన్ స్థాయిని కూడా రాగి పెంచుతుంది. అటు లివర్, చర్మాన్ని కూడా ఆరోగ్యంగా వుంచుతుంది. కాబట్టి ప్రతి రోజు కనీసం ఒక టీ కప్పు రాగి జావనైనా తాగడానికి అలవాటు చేసుకోండి, ఎందుకంటే మూడు నుంచి 4 కప్పుల కాఫీ, టీ తాగడం మనకు అలవాటు సహజం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications