Latest Updates
-
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా!
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్
సాధారణంగా ప్లేట్ లో ఆకుకూరలు కనిపిస్తే చాలు, పిల్లలు ముఖం మాడ్చేస్తారు. ఎన్నిసార్లు బతిమాలినా, బుజ్జగించినా ఆకుకూరలు తినేందుకు ససేమిరా అంటారు. దీంతోపిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను ఎలా అందించాలి? అని తల్లులు నిత్యం మదనపడుతుంటారు. అందుకే తల్లుల కష్టాన్ని తీర్చే ఒక అద్భుతమైన, రుచికరమైన రెసిపీ మెంతి పరాఠా.
మెంతుకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుతో పరాఠాలు చేస్తే, పిల్లలు అసలు కూరగాయలు తింటున్నామనే విషయమే మర్చిపోయి లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలకే కాదండోయ్..పెద్దల ఆరోగ్యానికి కూడా ఇది బోలెడు మేలు చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ మెంతి పరాఠా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మెంతి పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 2 కప్పులు
మెంతి ఆకులు - ఒక కట్ట
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
దంచిన అల్లం లేదా అల్లం పేస్ట్ - 1 టీస్పూన్
కారం - రుచికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
సోంపు గింజలు - అర టీస్పూన్
పచ్చి మిరపకాయలు - 2
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి - పరాఠాలు కాల్చడానికి
నీళ్లు - పిండి కలపడానికి
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
మెంతి పరాఠా తయారీ విధానం
-ముందుగా మెంతి ఆకులను రెండు మూడు సార్లు నీటిలో శుభ్రంగా కడగాలి. ఆకులను వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో గోధుమ పిండి, శనగపిండి వేయాలి. ఆ తర్వాత దంచిన అల్లం, కారం, పసుపు, ధనియాల పొడి, సోంపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పొడి మిశ్రమంలో ముందుగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులను, ఒక చెంచా నూనెను వేసి చేత్తో బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి ముద్దపై కొద్దిగా నూనె రాసి, మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల పరాఠాలు మృదువుగా వస్తాయి.
-15 నిమిషాల తర్వాత పిండిని మళ్లీ ఒకసారి బాగా మర్దనా చేయాలి. ఇప్పుడు పిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ, వాటిని గుండ్రటి పరాఠాల్లా కాస్త మందంగా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక ఒత్తి పెట్టుకున్న పరాఠాను వేయాలి. నూనె లేదా నెయ్యి రాస్తూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా దోరగా కాల్చుకోవాలి.
-ఎంతో రుచికరమైన వేడివేడి మెంతి పరాఠా రెడీ. వీటిని టొమాటో సాస్, పుదీనా చట్నీ లేదా చల్లటి రైతాతో పిల్లలకు వడ్డించి చూడండి. ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ అయిపోవడం ఖాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
