Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
శ్రీరామనవమికి పానకం, వడపప్పు.. ఈ కొత్త స్టైల్ ట్రై చేయండి..
శ్రీరామ నవమి అంటే పానకం గుర్తుకువస్తుంది. వీధుల్లో డ్రమ్ముల్లో పానకాన్ని నింపి దారిన పోయేవారందరికీ పానకాన్ని కావలసినంత అందిస్తారు. చాలా మంది ఇంట్లో పెద్ద పాత్రలను తీసుకొని వచ్చి పానకాన్ని పట్టుకువెళ్తారు. వడపప్పు కూడా పానకంతోపాటు సీతారాములకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ 2024 శ్రీరామనవమికి వడపప్పు, పానకాన్ని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం.

పానకం ప్రాముఖ్యత
శ్రీరామనవమిని చైత్రమాసం 9వ రోజున జరుపుకుంటారు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం. అయితే ఈ ప్రత్యేక రోజున శ్రీరాముడి వివాహం, శ్రీరాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయ్.
తెలుగు సాంప్రదాయాల్లో ఏ వేడుకనైనా పానకంతో జరుపుకుంటారు. వివాహాలు, ఇంట్లో జరిపే వ్రతాలు పూజల్లో కూడా పానకాన్ని భక్తులకు, అతిథులకు అందిస్తారు.
పానకం తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు
అవసరమైనంత బెల్లాన్ని సన్నగా తురుముకోవాలి. తరువాత వేసిన బెల్లానికి తగినంత నీరును అందులో పోసి బాగా కలుపుకోవాలి. అందులో చిటికెడు యాలాకుల పొడి, చిటికెడు అల్లంపొడి వేసి కలుపుకోవాలి. పానకానికి సరిపడా బెల్లం ఉందా, యాలాకుల పొడి సరిపోయిందా లేదా చూసుకొని నీళ్లల్లో బాగా కలుపుకోవాలి. తరువాత అందులో నిమ్మరసాన్ని పిండిదే రుచి అదిరిపోతుంది. దీంతో మన శ్రీరామనవమి పానకం రెడీ.
వడపప్పు చేయడం సులభం
కావలసినంత వడపప్పును తీసుకొని 2 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిలోంచి వడపప్పును తీసివేసి సీతారాముల నైవేద్యానికి సిద్ధం చేయండి.
పచ్చి చలిమిడిని ఈ విధంగా తయారు చేసుకోండి
బెల్లం బియ్యంపిండిని బాగా కలుపుకోవాలి. అవసరమైనంత నీరును పోసి రెండింటినీ కావలసినంతగా కలుపుకోవాలి. చపాతీ చేసే ముందు ఉండే పిండిలా తయారు చేసుకుంటే ఇక పచ్చి చెలిమిడి రెడీ అయినట్టే.
సరిగ్గా వేసవి కాలంలో శ్రీరామనవమి రావడం అప్పుడే చల్లని పానకం తాగడం శరీరానికి చాలా ఆరోగ్యకరం. బెల్లంలో ఉండే ఐరన్ శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దేవుడి ప్రసాదం మాత్రమే కాదు శరీరానికి మంచి పౌష్టికాహారం కూడా.ఈ శ్రీరామనవమితో పానకంతో తియ్యగా ఆరోగ్యకరంగా జరుపుకోండి.
ఇదే పానకాన్ని మీ వీధిలో ఉన్న అందరికీ చేసి పంచవచ్చు. ఒక డ్రమ్‌లో కూడా సులభంగా ఈ పానకాన్ని తయారు చేసుకోవచ్చు. ఇదే రెసిపినీ ఫాలో అవుతూ నీళ్లకు సరిపడ బెల్లంను కలుపుకొని పానకాన్ని రెడీ చేయండి. శ్రీరామనవమి మరింత ఉత్సాహంగా జరుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
