Latest Updates
-
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే!
చలికాలంలో ఈ సూప్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు! ఎలా అంటే?
చలికాలంలో సాధారణంగా అనారోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయి. అందుకే ఇమ్యూనిటీని పెంచే ఆహరం ఎక్కువగా తినాలి. ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్, సూప్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బయట హోటళ్లలో లేదా రెస్టారెంట్లలో ఆ ఆహరం తిని మళ్ళీ అనారోగ్యం పాలయ్యే బదులు వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచికి రుచి కూడా లభిస్తుంది.
ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే సూప్స్‌లో పెసరపప్పు సూప్ కూడా ఒకటి. ఈ సూప్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అయితే ఈ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? చాలా తక్కువ సమయంలో ఈ పెసరపప్పు సూప్‌ను ఎలా చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పెసర పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు
- పెసర పప్పు
- సన్నగా తరిగిన ఒక క్యారెట్
- నీరు
- తగినంత ఉప్పు
- నిమ్మరసం
- మిరియాలు
- నెయ్యి
- కొన్ని బఠాణీలు
పెసర పప్పు తయారీ విధానం
ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఆ పప్పు నానబెట్టడానికి కావాల్సినంత నీళ్లు పెట్టి నానబెట్టుకోవాలి. అలాగే ఒక క్యారెట్‌ను సన్నగా తరుగుకోవాలి. పెసర పప్పు నానాక.. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో పెసరపప్పు, క్యారెట్ తరుగు, కొంచెం నీరు, కడిగిన పచ్చి బఠాణీలు వేసుకొని మూత పెట్టుకోవాలి. అలాగే మూడు విజిల్స్ వచ్చే వరకు వాటిని ఉడకబెట్టుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ చల్లబడ్డ తరువాత.. కుక్కర్ మూత తీసి, ఒక సాస్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అలాగే మనం తీసుకొన్న కొన్ని మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే సూప్ మాదిరిగా ఆ పెసరపప్పు మిశ్రమం ఉండాలి కాబట్టి.. కొన్ని నీళ్లు పోసుకొని పలచగా చేసుకొని మరిగించుకోవాలి. అలాగే అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి.
రెండు ఉలుకులు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దానిపై ఒక నిమ్మకాయ రసం పిండి, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని.. ఒక సూప్ బౌల్‌లో వేడి వేడిగా తాగితే రుచి అదిరిపోతుంది అంతే. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. ఈ రెసిపీని ట్రై చేసి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
