Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి!
వేసవి కాలం, వర్షాకాలం లేదా వణికించే శీతాకాలం.. ఇలా కాలం ఏదైనా సరే కంచంలో కాస్తంత పెరుగు పడాల్సిందే. భోజనం చివర్లో కమ్మటి పెరుగు అన్నం తింటేనే మనకు కడుపు నిండిన పూర్తి సంతృప్తి కలుగుతుంది. సాధారణంగా పెరుగు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది పాలు. అసలు పాలు లేకుండా పెరుగును తయారు చేయడం లేదా తోడు పెట్టుకోవడం అసాధ్యం అని మనలో చాలామంది నమ్ముతారు. కానీ కేవలం వేరుశెనగలను ఉపయోగించి, చుక్క పాలు లేకుండానే ఎంతో చిక్కటి, రుచికరమైన పెరుగును తయారు చేయవచ్చని మీకు తెలుసా?

పాలు పడకపోవడం సమస్య ఉన్నవారికి, లేదా కొత్తగా, ఆరోగ్యకరంగా ఏదైనా ప్రయత్నించాలనుకునే వారికి ఈ వేరుశెనగ పెరుగు బెస్ట్ ఆప్షన్. దీనిని తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు, శ్రమ అస్సలు అవసరం లేదు. కేవలం మన వంటగదిలో ఉండే వస్తువులతో కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే చాలు.
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
వేరుశెనగ పెరుగును ఇంట్లో తయారు చేసే విధానం
-ఈ పెరుగు తయారీకి సుమారు ఒక కప్పు పచ్చి వేరుశెనగలను తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని తగినన్ని నీళ్లలో కనీసం 4 గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గింజలు మెత్తబడి, రుబ్బడానికి చాలా సులువుగా ఉంటుంది.
-బాగా నానిన వేరుశెనగలను ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దానికి సుమారు 3 కప్పుల నీటిని జతచేస్తూ ఎంతో మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. అయితే నీళ్లను ఒకేసారి పోయకూడదు, కొద్దికొద్దిగా పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక శుభ్రమైన పలుచటి కాటన్ లేదా మస్లిన్ వస్త్రాన్ని తీసుకుని, అందులో ఈ వేరుశెనగ పేస్ట్ ను వేసి గట్టిగా పిండాలి. ఇలా చేయడం వల్ల గుజ్జు (పిప్పి) వేరుపడి, స్వచ్ఛమైన, చిక్కటి వేరుశెనగ పాలు వస్తాయి.
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి
-వడకట్టి తీసిన ఈ చిక్కటి వేరుశెనగ పాలను ఒక గిన్నెలో తీసుకుని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అడుగు మాడిపోకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరిగి పైకి పొంగు వచ్చిన తర్వాత మంటను పూర్తిగా ఆపివేయాలి.
-పాలు మరిగిన తర్వాత వాటిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. పాలు కాస్త వెచ్చగా ఉన్నప్పుడు అందులో 7-8 పచ్చి మిరపకాయల తొడిమలను (కాడలను) వేయాలి. పచ్చిమిర్చి కాడలపై ఉండే సహజసిద్ధమైన బ్యాక్టీరియా పాలు సులభంగా విరిగి, పెరుగుగా మారడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
-పచ్చిమిర్చి కాడలు వేసిన గిన్నెపై గాలి పోకుండా మూత పెట్టి, కదల్చకుండా ఒక వెచ్చని ప్రదేశంలో 8 నుండి 9 గంటల పాటు అలాగే ఉంచాలి. రాత్రి పూట తోడు పెడితే, ఉదయానికల్లా గడ్డ పెరుగు సిద్ధంగా ఉంటుంది.
-8-9 గంటల లోపు గిన్నెను కదపడం లేదా మూత తీసి చూడటం చేయకూడదు. సమయం ముగిశాక మూత తెరిచి చూస్తే, ఎంతో చిక్కటి వేరుశెనగ పెరుగు రెడీ. ఇందులో వేరుశెనగల సహజసిద్ధమైన ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సాధారణ పాల పెరుగు కంటే దీని రుచి కాస్త భిన్నంగా, కమ్మగా ఉంటుంది. పాల ఉత్పత్తులు వాడని వారికి ఇదొక బెస్ట్ ఆల్టర్నేటివ్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications