Latest Updates
-
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు!
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
ఏదైనా పని మీద కిచెన్‌కో లేదా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి ఆ వెంటనే ఎందుకు వెళ్లారో ఆ పర్పస్ మర్చిపోవడం సాధారణంగా చాలా మందికి జరిగేదే. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఒక్కోసారి ఒక విషయం చెప్పాలనుకుని అప్పుడే మర్చిపోతాం. కొన్నిసార్లు పేర్లు కూడా మార్చిపోతారు. ఇలాంటి అనుభవం అందరూ ఎదుర్కొనేదే. వయసు పెరుగుతున్నకొద్దీ ఇలా జరుగుతుందనుకుని పట్టించుకోవడం మానేస్తారు. కానీ మనం పీల్చే గాలికి, మెదడు ఆరోగ్యానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. మతిమరుపు సాధారణ విషయం కాదని.. వయసు పైబడకముందే ఎదురయ్యే ఇలాంటి అనుభవాలను నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేటి మారుతున్న జీవనశైలి కారణంగా గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అవుతున్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే మనం పీల్చే గాలికి, మెదడు ఆరోగ్యానికి కూడా సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. గాలిలోని అతి సూక్ష్మ కాలుష్య కణాలు ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంపై మాత్రమే కాదు.. మెదడును సైతం ప్రభావితం చేసి జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం(అల్జీమర్స్) పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. డిమెన్షియా(మతిమరుపు) ప్రమాద కారకాలకి సంబంధించి వాయు కాలుష్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న భారత్ వంటి దేశాల్లో గాలి నాణ్యత పడిపోతున్న కారణంగా ప్రజారోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే డిమెన్షియా అంటే కేవలం విషయాలు మర్చిపోవడం మాత్రమే కాదు.. జ్ఞాపకాశక్తి, ఆలోచనాశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, రోజువారీ పనులను నిర్వర్తించే సామర్థ్యాన్ని సైతం ప్రభావితం చేసే వ్యాధిగా భావించాలి.

మతిమరుపునకు పరిష్కారం ఉందా..
డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ల మంది డిమెన్షియాతో బాధపడుతుండగా.. ఏటా 10 మిలియన్ల కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. 2050 నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నిర్ధారణ అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అల్జీమర్స్ కేవలం వృద్ధాప్యంలో వచ్చే సమస్య కాదు.. జీవనశైలి, పర్యావరణ కారకాల ప్రభావం కూడా దీనికి కారణంగా భావించాలని నిపుణులు అంటున్నారు.

వాయు కాలుష్యం (PM2.5 కారకాలు), అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం, అధిక మద్యపానం, డిప్రెషన్ వంటి అనేక కారణాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయి. అయితే డిమెన్షియా కేసుల్లో 45 శాతం వరకు కేసులను మార్చగలగడం లేదా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
భారత్‌లో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు సుమారుగా 104 మిలియన్ల మంది ఉండగా.. వీరిలో సుమారు 7 శాతం వరకు డిమెన్షియాతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే 100 మందిలో ఏడుగురి వరకు ఈ వ్యాధి లేదా వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తుల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. దీనిని నియంత్రించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడంతో పాటు సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, కాలుష్య కారకాల ప్రభావం నుంచి దూరంగా ఉండటం మంచిదని ఎక్స్‌పర్ట్స్ సలహా ఇస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications