Latest Updates
-
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం!
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
ఇడ్లీ, దోసెల్లోకి పల్లి చట్నీ, సాంబార్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, కమ్మగా కుర్మా ట్రై చేయండి. కానీ కుర్మా అనగానే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి. కొబ్బరి తురుముతో పనిలేకుండానే, మన వంటగదిలో ఎప్పుడూ ఉండే వేరుశెనగలు (పల్లీలు), టమాటాలు ఉపయోగించి ఎంతో రుచికరమైన కుర్మాను తయారు చేసుకోవచ్చు.
అద్భుతమైన రుచితో ఉండే ఈ టమాటా పల్లీ కుర్మా ఇడ్లీ, దోసెలకే కాకుండా చపాతీ, పూరీ, పరోటాల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. తయారీ విధానం కూడా చాలా తేలిక. కమ్మని టమాటా కుర్మా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
వెల్లుల్లి - 5 రెబ్బలు
టమాటాలు - 5
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
వేయించి పొడి చేయడానికి:
వేరుశెనగలు (పల్లీలు) - 4 టేబుల్ స్పూన్లు
సోంపు - ముప్పావు టీస్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 2
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు!
తయారీ విధానం
-ముందుగా ఐదు టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి, మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకోండి. మంటను మీడియంలో ఉంచి సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, వేరుశెనగలు వేసి దోరగా వేయించండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఆ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడా ఉండలు లేకుండా చిక్కటి పేస్ట్ లా కలుపుకుని పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో రెండు చెంచాల నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడించండి. ఆ తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
-ఉల్లిపాయలు మగ్గాక, చీల్చిన పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చి వాసన పోయేలా బాగా వేయించండి.
-ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ను అందులో వేసి, కొద్దిగా నీళ్లు (పావు కప్పు), పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. టమాటాలోని పచ్చి వాసన పోయే వరకు సుమారు 5 నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించండి.
-టమాటా మిశ్రమం చక్కగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న వేరుశెనగల పేస్ట్ ను అందులో వేయండి. దీనికి మరో రెండు కప్పుల నీళ్లు జతచేసి బాగా కలపండి. ఉప్పు సరిచూసుకుని మూతపెట్టి, మరో ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించండి.
-కుర్మా దగ్గరపడి, కమ్మటి వాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడి వేడి టమాటా వేరుశెనగ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
