Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బిర్యానీకి తమ్ముడు..బ్రేక్ ఫాస్ట్ కి రారాజు..అచ్చమైన హైదరాబాదీ కిచిడి ఎలా చేసుకోవాలంటే..
హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది బిర్యానీ, హలీమ్. కానీ నిజమైన హైదరాబాదీయులకు బ్రేక్ ఫాస్ట్ అంటే కిచిడి. ఇది సాధారణ కిచిడిలా ముద్దగా ఉండదు. ఇది పొడిపొడిగా, సుగంధ ద్రవ్యాల ఘమఘమలతో, నెయ్యి వాసనతో అద్భుతంగా ఉంటుంది. దీనిని హైదరాబాదీ దమ్ కిచిడి అని పిలుస్తారు. దీనికి కాంబినేషన్ గా ఖట్టా (పులుసు), కీమా లేదా ఆమ్లెట్ ఉంటే ఆ రుచే వేరు.
దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు) వాడటం, దీనిని బిర్యానీ లాగే దమ్ పద్ధతిలో వండటం. అందుకే ఇది బిర్యానీకి తమ్ముడిలా అనిపిస్తుంది.

కావలసిన పదార్థాలు
-సోనా మసూరి బియ్యం
-మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు)
-నూనె
-ఉల్లిపాయలు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పచ్చిమిర్చి
-పుదీనా ఆకులు
-కొత్తిమీర
-పసుపు
-ఉప్పు
-మంచినీళ్లు
-షాజీరా
-దాల్చిన చెక్క
-లవంగాలు
-యాలకులు
-బిర్యానీ ఆకు
తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర కప్పు సోనామసూరి బియ్యంని 1 గంటసేపు నానబెట్టాలి.
-స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి అందులో పావు కప్పు ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో 1 ఉల్లిపాయ పొడవాటి చీలికలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోండి.
-ఉల్లిపాయలు సగం పైన వేగిన తర్వాత అందులో 6 చీరిన పచ్చిమిర్చి, 4 లవంగాలు, 5 యాలకలు, 1 బిర్యానీ ఆకు, 1 టీస్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 నల్ల యాలకలు వేసి మీడియం మంట మీద వేయించాలి.
-ఉల్లిపాయలు బాగా వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2-3 నిమిషాలు వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో 1 కప్పు గంట సేపు నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు వేసి 2-3 నిమిషాలు వేసి ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు అందులో అర టీస్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి పప్పుని బాగా ఫ్రై చేసుకోండి.
-పప్పు నుంచి మంచి సువాసన వస్తుందన్నప్పుడు అందులో మూడున్నర కప్పుల నీళ్లు పోసుకోండి. ఇందులోనే 1 పెద్ద కట్ట పుదీనా తరుగు, కాడలతో సహా కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకున్నాక ఇందులో నానబెట్టిన బియ్యం వేసి బాగా కలుపుకొని మూతపెట్టి 12 నిమిషాలు మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
-తర్వాత మూత తీస్తే కిచిడి ఇంకా కాస్త చెమ్మతో ఉంటుంది,కాస్త పలుకుగా ఉంటుంది. ఈ దశలో కిచిడి మీద టిష్యూ నాప్ కిక్స్ పెట్టి దమ్ లీక్ అయిపోకుండా టిఫ్యూలపైన వాటర్ చల్లుకొని మూతపెట్టి తక్కువ మంట మీద 12 నిమిషాలు ఉడికించాలి.తర్వాత స్టవ్ ఆపేయండి.
-10 నిమిషాల తర్వాత మూత తీస్తే కమ్మని హైదరాబాదీ కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications