Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
యాంటీ ఆక్సిడెంట్ రైస్..రోజూ తినే రైస్ బోర్ కొడితే ఇలా చేసుకోండి..రుచికి నాలుక నాట్యమాడుతుంది
రోజూ ఒకేరకమైన రైస్ వెరైటీలు తిని తిని బోర్ కొట్టిందా? కొత్తగా నాలుకకి ఏదైనా రుచిగా తగిలితే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే యాంటీ ఆక్సిడెంట్ రైస్ ఒకసారి ట్రై చేయండి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పాలకూరతో చేసే రైస్ ని యాంటీ ఆక్సిడెంట్ రైస్ అంటారు. ఇది చేయడం చాలా సింపుల్. హెల్దీ కూడా. కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ యాంటీ ఆక్సిడెంట్ రైస్ ని తయారు చేయడం ఎలా, యాంటి ఆక్సిడెంట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
యాంటీ ఆక్సిడెంట్ రైస్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-పాలకూర
-బాస్మతి బియ్యం
-పుదీనా
-మెంతికూర
-కొబ్బరి తురుము
-వేరుశెనగపప్పు
-కొత్తిమీర
-టమాటో
-పసుపు
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-మిరియాలు
-పచ్చి బఠానీ

యాంటీ ఆక్సిడెంట్ రైస్ తయారీ విధానం
-స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న సైజు కుక్కర్ ని పెట్టి అందులో జీలకర్ర కొంచెం, పచ్చిమిర్చి,అల్లం పేస్ట్,మిరియాల ముక్క చెక్క వేసి దోరగా వేయించాలి.
-తర్వాత అందులో చిటికెడు పసుపు, 1 కప్పు టమాటో ముక్కలు వేసి కొంచెం వేగాక అందులో మెంతికూర 1 కప్పు, పాలకూర 1 కప్పు, పుదీనా 1 కప్పు,అరకప్పు పచ్చి బఠానీ,కొంచెం నిమ్మరసం, కడిగిన బాస్మతి బియ్యం 1 కప్పు వేసి నీళ్లు పోయకుండానే మూత పెట్టేయండి. ఎందుకంటే ఆకు కూరల్లో ఉండే నీటితోనే రైస్ ఉడుకుతుంది.
-రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి రైస్ మీద కొంచెం కొబ్బరి తురుము, వేరు శెనగపప్పుల ముక్క చెక్క వేసి వాటిని రైస్ లో బాగా కలపాలి.
-తర్వాత అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే యాంటీ ఆక్సిడెంట్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications