Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
Tomato Soup: చలికాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ సూప్ తాగాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే?
సాధారణంగా శీతాకాలంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది తరచుగా రోగాల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు, శరీరాని వెచ్చదనాన్ని ఇవ్వాలంటే టమాటో సూప్ తాగాలి. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే ఈ టమాటో సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టమాటో సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- పావుకిలో టమాటోలు
- ఒక స్పూన్ జీలకర్ర పొడి
- ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- ఒక స్పూన్ కారం
- ఒక స్పూన్ మిరియాల పొడి
- పావు కప్పు పుదీనా
- రుచికి సరిపడా ఉప్పు
- మూడు కప్పుల నీళ్లు
టమాటో సూప్ తయారీ విధానం
ముందుగా మనం తీసుకున్న పావుకప్పు టమాటోలను శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని మూడు ముక్కలు చేసి కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ఆ టమాటోలు ఉడకడానికి సరిపడా మూడు కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేవరకు ఆ టమాటోలను ఉడకనివ్వాలి. టమాటోలు బాగా ఉడికిపోయాకా వాటిని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఒకవేళ ఆ మిశ్రమం చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే అందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. సూప్ మరుగుతున్న సమయంలో అందులోనే అల్లం, కారం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెంసేపు మూత పెట్టేయాలి.
టమాటో సూప్ కొంచెం మరిగాక అందులో పుదీనా తురుమును వేసుకోవాలి. ఒక్క కలుపు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. టమాటో మరిగిపోయా స్టవ్ ఆఫ్ చేసి సూప్ కిందకు దించేసి ఎంజాయ్ చేయడమే.
టమాటో సూప్ ఉపయోగాలు
ఈ టమాటో సూప్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి. ఇందులో ఉండే సెలీనియం, రక్తహీనతల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. టమాటోల్లోని పొటాషియం శరీరంలోని సోడియం లెవెల్స్‌ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. బీపీ పేషెంట్స్ ఈ సూప్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ ఉండడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు కంటిచూపు మెరుగవుతుంది. అలాగే ఈ సూప్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications