Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Diwali Special Recipe: దీపావళి స్పెషల్..జస్ట్ 10 నిమిషాల్లో నోట్లో వేస్తే కరిగిపోయే మధురమైన మిల్క్ పెడా
అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు పండుగల సందడి మొదలవుతుంది. వీధివీధినా దీపకాంతులు, ఇంటా బయటా ఆనంద కోలాహలాలు, మనసు నిండా ఉత్సాహం నిండిపోతాయి. ముఖ్యంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే దీపావళి పండుగ ఈ నెలకే ప్రత్యేక ఆకర్షణను తెస్తుంది. పండుగ అంటేనే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడం, నోటిని తీపి చేసుకోవడం. ఈ సమయంలో ప్రతి ఇంట్లోనూ రకరకాల పిండివంటలు, స్వీట్ల సువాసనలు గుబాళిస్తుంటాయి.
అయితే హడావుడి జీవితంలో గంటల తరబడి స్వీట్లు చేయడానికి సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారికోసం అతి తక్కువ పదార్థాలతో, చాలా తక్కువ సమయంలో చేసుకోగలిగే ఒక అద్భుతమైన స్వీట్ ఉంది. అదే మిల్క్ పెడా లేదా పాలకోవ పెడా. దీని పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరతాయి. దుకాణాల్లో కొనే పెడాల కన్నా మన చేతులతో స్వచ్ఛంగా ఇంట్లో తయారుచేసుకుంటే ఆ రుచే వేరు. దీని తయారీ చాలా సులభం. ఈ దీపావళికి మీ ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యపరిచేలా ఈ మధురమైన పెడాలను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మిల్క్ పెడా తయారీకి కావలసిన పదార్థాలు
-పాలపొడి - 1 కప్పు
-కాచి చల్లార్చిన పాలు - పావు కప్పు
-చక్కెర - అర కప్పు
-యాలకులు - 3 లేదా 4
-నెయ్యి - 2 నుండి 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అర కప్పు చక్కెర, యాలకులు వేసి సువాసన వచ్చేలా మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పాలపొడి వేయండి. దానికి కాచి చల్లార్చిన పావు కప్పు పాలను కొద్దికొద్దిగా పోస్తూ ఎక్కడా ఉండలు కట్టకుండా చిక్కని, మృదువైన పేస్టులా కలపాలి.
-తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక పాన్ ను స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద 2 చెంచాల నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలపొడి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చక్కెర-యాలకుల పొడిని కూడా పాన్ లో వేసి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. మంటను తక్కువలో ఉంచి మిశ్రమాన్ని అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి.
-సుమారు 3-4 నిమిషాల్లో మిశ్రమం చిక్కబడి పాన్ అంచులను వదిలి ముద్దలా దగ్గరపడుతుంది. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి మార్చండి.
-మిశ్రమం కాస్త చల్లారి, గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, దాన్ని రెండు నిమిషాల పాటు మెత్తగా కలపండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయంత ఉండలు తీసుకుని, గుండ్రంగా చేసి,మధ్యలో బొటనవేలితో కొద్దిగా నొక్కి పెడా ఆకృతిలో ఒత్తుకోవాలి.
-మీకు నచ్చితే వాటిపై బాదం లేదా పిస్తా పలుకులతో అలంకరించుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన, నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిల్క్ పెడాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications