Latest Updates
-
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
ఇడ్లీ, దోశల్లోకి కాంబినేషన్‌గా రొటీన్ గా కొబ్బరి పచ్చడి, పల్లి చట్నీ లేదా సాంబార్ చేసుకుంటాం. అప్పుడప్పుడు ఇడ్లీ కారం పొడితో సరిపెట్టేస్తాం. కానీ ఎప్పుడైనా ఇడ్లీ, దోసెల్లోకి ఉల్లి కారం ట్రై చేశారా? ఇది టిఫిన్స్ తో పాటు వేడి వేడి అన్నంలోకే బాగుంటుంది.
ఉల్లిపాయ కారం తయారు చేయడం చాలా సులువు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. స్పైసీ అండ్ టేస్టీ ఉల్లిపాయ కారం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఉల్లిపాయ కారం తయారీకి కావలసిన పదార్థాలు
వేయించి రుబ్బుకోవడానికి
సాంబార్ ఉల్లిపాయలు- అర కిలో
మెంతులు - పావు టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
నువ్వుల నూనె- 2 టేబుల్ స్పూన్లు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో సగం
తాలింపు కోసం
నువ్వుల నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఆవాల పొడి - అర టీస్పూన్
మెంతుల పొడి (లేదా మెంతులు) - పావు టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
తగినంత ఉప్పు
బెల్లం - అర టేబుల్ స్పూన్
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
ఉల్లిపాయ కారం తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఓ మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడే వరకు వేయించండి.
-ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసి, అవి
కాస్త రంగు మారి పారదర్శకంగా అయ్యేవరకు బాగా వేయించుకోండి. ఆ తర్వాత
అందులోనే కొద్దిగా చింతపండు వేసి, మంటను మీడియంలో పెట్టి మరో 2
నిమిషాల పాటు కలపండి.
ఈ మిశ్రమాన్ని స్టవ్ పైనుంచి దించి, పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి, నీళ్లు అస్సలు పోయకుండా కాస్త బరకగా (కోర్స్‌గా) రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మళ్లీ అదే బాండీలో తాలింపు కోసం 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.
-నూనె కాగాక ఆవాల పొడి, మెంతి పొడి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి బాగా కలపండి. వెంటనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ గుజ్జును ఇందులో వేసి నూనెలో బాగా కలిసేలా వేయించండి. అవసరమైతే మధ్యలో మరో స్పూన్ నూనె వేసుకోవచ్చు.
-పచ్చడిలోని పచ్చివాసన పోయిన తర్వాత, చివరగా కొద్దిగా బెల్లం తురుము వేసి బాగా కలపండి. బెల్లం కరిగి, పచ్చడి ముద్దగా మారి చుట్టూ నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-అంతే ఘుమఘుమలాడే ఉల్లిపాయ కారం రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత ఓ పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
