Latest Updates
-
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.!
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.!
దోశలు తినాలనే క్రేవింగ్స్ కలిగినప్పుడు, ఇంట్లో పిండి లేకపోతే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. లేదంటే రవ్వ లేదా గోధుమ పిండి దోశలు వేసుకుని అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఎప్పుడైనా ఇలా సేమియాతో అట్టు ట్రై చేశారా.. అదేంటి అనుకుంటున్నారా.. సేమియా అనగానే ఎవరికైనా పాయసం, ఉప్మా గుర్తొస్తుంది. ఇక పాయసం చేస్తే గిన్నెలు నాకుతూ తినేస్తారు. కానీ ఎప్పుడైనా సేమియాతో కొత్తగా ఇలా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవడంతో పాటు పొట్టకి చాలా లైట్‌గా హెల్తీగా ఉంటుంది.

సేమియా అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
రోస్టెడ్ గోధుమ సేమియా- కప్పు(పావు కేజీ)
ఉల్లిపాయ- ఒకటి(పెద్దది)
క్యారెట్- ఒకటి(పెద్దది)
పచ్చిమిర్చి- రెండు
అల్లం- చిన్న ముక్క
ఉప్పు- టీస్పూన్
మిరియాల పొడి- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
ఇంగువ- పావు టీస్పూన్
బొంబాయి రవ్వ- పావు కప్పు
బియ్యం పిండి- అర కప్పు
కరివేపాకు- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
సేమియా అట్టు తయారీ విధానం
ముందుగా సేమియాను ఒక బౌల్‌లో తీసుకుని అందులో కొన్ని వేడి నీళ్లు పోసి మూడు నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం ద్వారా సేమియా మెత్తబడుతుంది.
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి!
ఇప్పుడు నానబెట్టిన సేమియాలో నీళ్లు వడగట్టుకోవాలి. ఈ సేమియాలో చిన్నగా తరిగిన ఉల్లిపాయ, తురిమిన క్యారెట్, చిన్నగా కట్‌చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర వేసి బాగా కలిసేలా కలపాలి.
కొద్దిగా ఇంగువ, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసి చేత్తో కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మూత తీసి చూస్తే పిండి కొంచెం మెత్తబడుతుంది. అందులో అర కప్పు నీళ్లు పోసి గరిటెతో మరోసారి కలపాలి. ఊతప్పం పిండి కంటే కొంచెం గట్టిగా కలపాలి.
స్టవ్‌పైన పెనం పెట్టుకుని వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి అప్లై చేసి పెనం చుట్టూ పరుచుకోవాలి. ఇప్పుడు దీనిపైన గరిటెతో ఊతప్పం మాదిరిగా అట్టు పోసి పైనుంచి కొద్దిగా నూనె చల్లి మూత పెట్టి మీడియం మంటపైన రెండు నిమిషాలు కాల్చుకోవాలి.
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.!
కాలిన తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా మొత్తం పిండిని చేసుకోవాలి. సేమియా అట్లు రెడీ. వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
రెగ్యులర్, ఇన్‌స్టంట్ అట్లతో సేమియా అట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండి ఎనర్జీని ఇస్తాయి. ఉల్లిపాయ, క్యారెట్ తురుము కలపడంతో ఫైబర్ పుష్కలంగా మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది. మైదా సేమియాకు బదులుగా గోధుమ సేమియాతో చేయడం ద్వారా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
