రెస్టారెంట్‌లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్‌ లెవెల్‌ టేస్ట్‌ ఇచ్చే జోధ్‌పూర్‌ పనీర్‌ మసాలా.!

పనీర్‌ అంటే వెజ్‌, నాన్‌ వెజ్‌ లవర్స్‌ అని తేడా లేకుండా ఇష్టపడతారు. ఈ పనీర్‌ కర్రీస్‌లో చాలా వెరైటీలు ఉంటాయి. ఇక రెస్టారెంట్‌కి వెళితే పెద్ద లిస్టే ఉంటుంది. కానీ ఈ రెసిపీని మాత్రం రెస్టారెంట్‌లో చూసి ఉండరు. అదే జోధ్‌పూర్‌ స్టైల్‌ పనీర్‌ మసాలా. ఇంట్లోనే చాలా ఈజీగా, రుచికరంగా చేసుకోవచ్చు. ఎప్పుడూ రెగ్యులర్‌ పనీర్‌ కర్రీస్‌తో బోర్‌ కొట్టిన వారు ఇలా కొత్తగా ట్రై చేయండి. జోధ్‌పూర్‌ పనీర్‌ మసాలా ఎలా చేయాలో చూద్దాం…

Jodhpur paneer masala recipe with next level taste recipe process in telugu

జోధ్‌పూర్‌ పనీర్‌ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

తాజా పనీర్‌- 200 గ్రాములు
నెయ్యి- 4 టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర- పావు టీస్పూన్‌
ఇంగువ- పావు టీస్పూన్‌
పచ్చిమిర్చి- రెండు
కట్‌ చేసిన వెల్లుల్లి రెబ్బలు- టేబుల్‌ స్పూన్‌
ఉల్లిపాయ- ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌
టమాటాలు- రెండు
కారం- టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర పొడి- టీస్పూన్‌
ధనియాల పొడి- అర టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
నీళ్లు- ముప్పావు కప్పు
టమాటా ప్యూరీ- అర కప్పు
జీడిపప్పు పేస్ట్‌- పావు కప్పు
ఏలకులు- ఆరు
కసూరి మెంతి- టేబుల్‌ స్పూన్‌
తాజా క్రీమ్‌- మూడు టేబుల్‌ స్పూన్లు
గరం మసాలా- పావు టీస్పూన్‌

జోధ్‌పూర్‌ పనీర్‌ మసాలా కర్రీ తయారీ విధానం

పుదీనాతో చీజ్‌ శాండ్‌విచ్‌.. ఒక్కసారి టేస్ట్‌ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!

ముందుగా తాజా పనీర్‌ను తీసుకుని క్యూబ్స్‌ మాదిరిగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత కట్‌ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గనివ్వండి.

ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించిన తర్వాత చిన్నగా కట్‌ చేసిన టమాటాలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

Jodhpur paneer masala recipe with next level taste recipe process in telugu

కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోండి ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించిన తర్వాత అర కప్పు టమాటా ప్యూరీ వేసి కలిగి ఉడికించాలి. జీడిపప్పు పేస్ట్‌ వేసి గ్రేవీ చిక్కగా అయ్యేలా ఉడికించండి. మరికాసిన్ని నీళ్లు పోసి ఉడికించాలి.

Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

ఇప్పుడు పనీర్‌ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. పనీర్‌ ముక్కలకు మసాలా బాగా పట్టి ఉడికిన తర్వాత ఏలకుల పొడి, కసూరి మెంతి, ఫ్రెష్‌ క్రీమ్, కొద్దిగా నెయ్యి వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. గరం మసాలా వేసి మరోసారి కలపండి.

చివర్లో కొత్తిమీర వేసి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. కొత్తగా పనీర్‌ మసాలా కర్రీ రెడీ. పులావ్‌, చపాతీ, బటర్‌నాన్‌లోకి ఇది ఎవర్‌ గ్రీన్‌ కాంబినేషన్‌.

[ of 5 - Users]
Story first published: Sunday, September 20, 2026, 13:38 [IST]
Desktop Bottom Promotion