కార్తీకమాసం స్పెషల్.. ఘుమఘుమలాడే అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ మీ ఇంట్లోనే చేసుకోండిలా..

Posted By:

కార్తీకమాసం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లోనూ భక్తి భావంతో పాటు కమ్మని సాత్విక వంటకాల ఘుమఘుమలు మొదలవుతాయి. ఉల్లి, వెల్లుల్లి లేకుండా వండే ఆహారానికి ఈ పవిత్ర మాసంలో ఎంతో ప్రత్యేకత ఉంది. మరి ఈ మాసంలో గుడి ప్రసాదాన్ని తలపించే అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ చేస్తే సాటిలేని రుచి, మైమరపించే సువాసన వస్తాయి. ఆ ఘుమఘుమలకు ఇంట్లోని వారందరూ భోజనానికి క్యూ కట్టడం ఖాయం. కార్తీక మాసం స్పెషల్ బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో చూడండి.

కావాల్సిన పదార్థాలు

కందిపప్పు: 1 కప్పు
నీరు: 2 కప్పులు
పసుపు: అర టీస్పూన్ (పప్పులోకి పావు, కూరగాయలకు పావు టీస్పూన్)
నూనె: 1 టీస్పూన్
టమాటో: 1 పెద్దది
వంకాయ: 1
మునక్కాడ: 1 పెద్దది
సొరకాయ: 1 చిన్న ముక్క
క్యారెట్: 1
బెండకాయలు: 3
చింతపండు: నిమ్మకాయంత
ఉప్పు: ఒకటిన్నర టీస్పూన్
ఇంట్లో చేసిన సాంబార్ పొడి: ఒకటిన్నర టేబుల్ స్పూన్
బెల్లం: 1 టేబుల్ స్పూన్
కరివేపాకు: 2 రెమ్మలు
కొత్తిమీర: గుప్పెడు

Karthika Masam Special Authentic Brahmin Style Sambar Recipe in Telugu

తాలింపు కోసం:

నెయ్యి: ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఆవాలు: అర టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
మినపప్పు: అర టీస్పూన్
ఎండుమిర్చి: 3
కరివేపాకు: 1 రెమ్మ
ఎల్‌జీ కంపౌండెడ్ ఇంగువ పొడి: అర టీస్పూన్

చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే..విటమిన్ C, ప్రోటీన్లు మెండుగా ఉండే ఉసిరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, 2 కప్పుల నీరు, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ నూనె వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక గిన్నెలో తరిగిన టమాటో, వంకాయ, మునక్కాడ, సొరకాయ, క్యారెట్, బెండకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు, పావు టీస్పూన్ పసుపు, ఉప్పు వేసి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.

-తర్వాత నానబెట్టిన చింతపండు నుండి తీసిన రసం, ఇంట్లో తయారుచేసిన సాంబార్ పొడి, బెల్లం, 2 రెమ్మల కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు మీడియం మంటపై మరిగించాలి. ఇప్పుడు ఉడికించిన కందిపప్పును, అవసరమైనన్ని నీళ్లు పోసి సన్నని మంటపై 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అప్పుడే రుచులన్నీ కూరగాయలకు చక్కగా పడతాయి.

-చివరగా తాలింపు కోసం.. ఒక చిన్న పాన్‌ లో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగాక స్టవ్ ఆపే ముందు ఎల్‌జీ కంపౌండెడ్ ఇంగువ పొడిని వేసి, ఇల్లంతా సువాసనతో నిండిపోయే ఆ నేతి తాలింపుని వెంటనే మరుగుతున్న సాంబార్‌ లో కలపాలి. పైనుంచి గుప్పెడు కొత్తిమీర చల్లితే చాలు, అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ రెడీ.

-వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ కమ్మని సాంబార్ వేసుకుని అప్పడంతో తింటే ఆ స్వర్గీయమైన రుచిని మాటల్లో వర్ణించలేం.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 18, 2026, 13:50 [IST]
Desktop Bottom Promotion