Latest Updates
-
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే!
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా..
పులిహోర రుచి చూడని తెలుగు వారు ఉండరు. అయితే పులిహోర అంటే చాలామంది రెగ్యులర్ గా చేసుకుని తినేది నిమ్మకాయ పులిహోర లేదా చింతపండు పులిహోర మాత్రమే. అయితే కార్తీక మాసం అనగానే వనభోజనాలు ఉసిరి చెట్టుకు పూజ చేయడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చేస్తుంటాం. అయితే ఉసిరికాయతో ఎప్పుడైనా పులిహోర ట్రై చేశారా? రుచి అద్భుతంగా ఉంటుంది. దీపావళి, కార్తీక మాసం స్పెషల్ గా ఉసిరికాయ పులిహోరను మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉసిరికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పసుపు
-ఉసిరికాయ తురుము
-ఉప్పు
-వేరుశెనగ నూనె
-ఆవాలు
-జీలకర్ర
-జీడిపప్పు
-పచ్చి శెనగపప్పు
-చల్ల మిరపకాయ
-నల్ల మినపప్పు
-అల్లం తరుగు
-ఇంగువ
-కొత్తిమీర
-కరివేపాకు

ఉసిరికాయ పులిహోర తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టకుండా వెంటనే ప్రెషర్ కుక్కర్ లో వేసుకోండి. ఇందులో 3 కప్పుల నీళ్లు పోసి, కొద్ది ఉప్పు వేసి మూతపెట్టి పెద్ద మంట మీద 1 విజిల్, మీడియం మంట మీద 3 విజిల్స్(మొత్తంగా 3 విజిల్స్)రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి నూనె రాసిన పళ్లెంలోకి ఆ అన్నాన్ని మార్చుకోండి.
-అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో కొద్దిగా ఉప్పు, 1 టీస్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ నూనె వేసి అన్నాన్ని కలుపుకోండి.
-అన్నం చల్లారేలోగా 5 ఉసిరికాయలను గ్రేటర్ లో కాస్త పెద్ద రంధ్రాలున్నవైపు పెట్టి తురుముకోండి. దీన్ని పక్కన ఉంచుకోండి.
-తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 7-8 టేబుల్ స్పూన్ల నూనె వేడి చెయ్యండి. వేడెక్కిన నూనెలో అర టేబుల్ స్పూన్ పొట్టు నల్ల మినపప్పు, 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి ఎర్రగా వేయించాలి.
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్..
-జీడిపప్పు కాస్త ఎర్రబడటం మొదలైనప్పుడు అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల సన్నని అల్లం తరుగు, 2 చల్ల మిరపకాయల ముక్కలు వేసి వేపండి. చల్లమిరపకాయ కాస్త రంగు మారగానే అందులో కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి కలపండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి బాండీలో ఉసిరికాయ తురుము వేసి 3 నిమిషాలు వేపాలి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ బాండీలోనే పసుపు కలుపుకుని పక్కన ఉంచుకున్న అన్నం వేయండి. కాస్త ఎక్కువగా కొత్తిమీర చల్లుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకుని తర్వాత స్టవ్ ఆపేయండి.
-అంతే ఉపిరికాయ పలిహోర రెడీ. అయితే దీన్ని వెంటనే తినకుండా 1 గంట ఆగి తింటే ఫ్లేవర్స్ అన్నీ రైస్ కి పట్టి రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
