కాఫీ, టీలు పక్కన పెట్టండి..ఉదయాన్నే ఈ గంజి తాగితే ఏనుగు అంత బలం!

Posted By:

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగడం మనలో చాలామందికి అలవాటు. కానీ ఆ అలవాటును పక్కనపెట్టి తమిళనాడు ఫేమస్ కట్టుయానం బియ్యం గంజిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే, మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. తమిళంలో కట్టు అంటే అడవి, యానం అంటే ఏనుగు అని అర్థం.

అడవిలో ఏనుగు ఎంత బలంగా ఉంటుందో, ఈ బియ్యం తింటే మనిషికి అంతటి బలం చేకూరుతుందని పెద్దల నమ్మకం. అంతేకాదు ఈ పంట పొలాల్లో ఏనుగు ఎత్తులో ఏపుగా పెరుగుతుంది. ఇది ఎర్ర బియ్యం రకానికి చెందినది, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కట్టుయానం బియ్యంతో హెల్దీ గంజిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Kattuyanam Kanji Recipe in Telugu Best for Weight Loss Diabetes Control Ancient Superfood for Your Body

తయారీకి కావాల్సిన పదార్ఠాలు
-కట్టుయానం బియ్యం
-నీరు
-చిన్న ఉల్లిపాయ
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-పెరుగు
-ఇంగువ
-ఉప్పు

తయారీ విధానం

-ముందుగా కట్టుయానం బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీడలో లేదా ఎండలో ఆరబెట్టాలి. తేమ పోయిన తర్వాత మిక్సీలో రవ్వలా బరకగా పొడి చేసుకోవాలి.

-రెడీ చేసుకున్న రవ్వను కుక్కర్‌ లో వేసి, తగినంత నీరు పోసి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి.

-చల్లారిన అన్నంలో మరికొన్ని నీళ్లు, రెండు రెమ్మల కరివేపాకు వేసి రాత్రంతా అలానే ఉంచాలి.

-మరుసటి రోజు ఉదయం మిక్సీలో చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి పెరుగు, చిటికెడు ఇంగువ కలపాలి. రాత్రి నానబెట్టిన అన్నంలో ఈ మసాలా పెరుగు మిశ్రమాన్ని, తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.

-అంతే ఎంతో బలవర్ధకమైన కట్టుయానం గంజి రెడీ.

ఉపయోగాలు
ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల, ఒక గ్లాసు తాగగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన మొండి కొవ్వును, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

మధుమేహానికి చెక్: ఈ బియ్యం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే దీనిని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది అమృతంతో సమానం.

జీర్ణశక్తికి మంచిది: అన్నాన్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టడం వల్ల ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఇది పేగులకు మేలు చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను ఇది శాశ్వతంగా దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తి: జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.

[ of 5 - Users]
Story first published: Thursday, February 12, 2026, 17:09 [IST]
Desktop Bottom Promotion