Latest Updates
-
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కాంబినేషన్..కీర దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలంటే
తెలుగువారి భోజనంలో పచ్చడి లేకపోతే ఆ పూట ముద్ద దిగదంటే అతిశయోక్తి కాదు. ఉదయం టిఫిన్ అయినా, మధ్యాహ్నం భోజనం అయినా.. పక్కన కొంచెం పచ్చడి ఉంటే ఆ రుచే వేరు. మనం రకరకాల కూరగాయలతో పచ్చళ్లను చేసుకుంటూ ఉంటాం.
అయితే ఎంతో రుచిగా ఉంటూనే, శరీరానికి చలువ చేసే పచ్చడి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కీర దోసకాయ పచ్చడి. నోటికి కమ్మగా తగిలే కీర దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, అందుకు కావాల్సిన పదార్థాలేమిటో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కీర దోసకాయలు - 2
పచ్చిమిర్చి -6-8
ఎండు మిరపకాయలు - 2
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5
చింతపండు -నిమ్మకాయ సైజు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు, కొత్తిమీర - తగినంత
ఇంగువ - చిటికెడు
నూనె - సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేడి
చేయాలి.
-నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక పచ్చి శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. చివరగా శుభ్రం చేసిన కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
-వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు జతచేసి, నీరు పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు కీర దోసకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో రుబ్బుకున్న పచ్చడి మిశ్రమంలో ఈ దోసకాయ ముక్కలను వేసి గ్రైండ్ చేయాలి. దోసకాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకూడదు, తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటేనే ఈ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, మినపప్పు, చితక్కొట్టిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి ఈ తాలింపును పచ్చడిలో కలుపుకోవాలి. పైన కొంచెం తాజా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, కమ్మని కీర దోసకాయ చట్నీ రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా లేదా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ తో తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications