Latest Updates
-
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు.. -
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ -
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్ -
పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి! -
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే? -
స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి! -
కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్! -
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! -
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా?
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి!
పేదలు అయినా, ధనికులు అయినా అందరి ఇళ్లల్లో అరటిపండ్లు కనిపిస్తుంటాయి. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందించే అరటిపండ్లను రుచి చూడని వారెవరూ ఉండరు. అయితే మనం మార్కెట్ నుంచి ఎంతో ఇష్టపడి కొని తెచ్చుకున్న అరటిపండ్లు.. రెండు, మూడు రోజులకే తొక్క నల్లగా మారిపోయి, పాడవ్వడం మనం తరచుగా చూస్తుంటాం. అలాంటప్పుడు వాటిని తినలేక చెత్తబుట్టలో పారేస్తుంటాం. మీ ఇంట్లో కూడా ఇదే సమస్య ఎదురవుతోందా?
కొన్ని చిట్కాలు పాటిస్తే అరటిపండ్లు మురిగిపోకుండా, పాడవకుండా నివారించవచ్చు. అరటిపండ్లను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిజ్ లో వాటిని భద్రపరుచుకునే ఈ పద్ధతిలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఇక్కడ చూడండి.

మెత్తబడిన పండ్ల పట్ల జాగ్రత్త
మీరు నిల్వ చేయాలనుకున్నప్పుడు, పండ్లను ఒకసారి పరిశీలించండి. ఇప్పటికే బాగా మెత్తబడిన లేదా తడిగా ఉన్న అరటిపండ్లను గుర్తించి వాటిని విడిగా ఉంచండి. వాటిని వీలైనంత త్వరగా తినేయడం మంచిది. మంచిగా ఉన్న పండ్లను మాత్రమే నిల్వకు ఎంచుకోండి.
పొడి పాత్రల వినియోగం
మీరు పండ్లను ఏ పాత్రలో లేదా కవర్ లో ఉంచాలనుకుంటున్నారో.. ఆ పాత్ర పూర్తిగా శుభ్రంగా, ఏమాత్రం తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తేమ పండ్లను త్వరగా పాడయ్యేలా చేస్తుంది.
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే?
సరైన ఉష్ణోగ్రత
అరటిపండ్లను ఫ్రిజ్ లో లో ఉంచేటప్పుడు తగిన ఉష్ణోగ్రతను నిర్వహించడం చాలా ముఖ్యం. సాధారణంగా అరటిపండ్లు ఎప్పుడు పాడవ్వడం మొదలవుతాయనేది.. మీ ఫ్రిజ్ పనితీరు,మీరు వాటిని నిల్వ చేసే పరిస్థితులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న, అద్భుతమైన పద్ధతిని పాటించడం వల్ల తమకు ఏకంగా 3 నుండి 4 వారాల పాటు అరటిపండ్లు ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
