Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
Central Bank Gold Buying Crashes 80% in January, Falls to Just 5 Tonnes WGC -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
Gold Rates in India 100 grams Dropped RS 31,100 know 24k 22k 18k Yellow Metal prices on March 4
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
మీరు చికెన్ ప్రియులా? కారంగా, నోరూరించే మసాలాలతో, బటర్ నాన్ లేదా వేడివేడి రోటీలో అద్దుకుని తినడానికి అదిరిపోయే చికెన్ కోసం వెతుకుతున్నారా? అయితే లాహోరి కడాయి చికెన్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పుట్టిన ఈ వంటకం ఇప్పుడు మన దేశంలోని దాబాలు, భారతీయ రెస్టారెంట్లలో హాట్ ఫేవరెట్ గా మారిపోయింది.
ఈ కర్రీకి నీళ్లలాంటి గ్రేవీ ఉండదు. టమాటాలు, మసాలాలతో తయారైన చిక్కటి గ్రేవీ చికెన్ ముక్కలకు అతుక్కుని, ప్రతి ముద్దలోనూ అద్భుతమైన రుచిని పంచుతుంది. మన వంటగదిలో ఉండే సాధారణ మసాలా దినుసులతోనే, సరైన పద్ధతిలో వండితే పక్కా దాబా స్టైల్ రుచి మీ సొంతం అవుతుంది.
లాహోరి కడాయి చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ - 500 గ్రాములు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
పసుపు - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
కసూరి మేథి - 1 టీస్పూన్
పెరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
లాహోరి కడాయి చికెన్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి,లోతైన కడాయి లేదా పాన్ లో నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి, మీడియం మంటపై దోరగా వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేంత వరకు నిమిషం పాటు వేయించండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత, సన్నగా తరిగిన టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు కలపండి. టమాటాలు పూర్తిగా మెత్తబడి, మిశ్రమం నుండి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. అప్పుడే కారం, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి, చిన్న మంట మీద 2-3 నిమిషాల పాటు మసాలాలు మాడకుండా వేయించి వాటిలోని ఫ్లేవర్స్ ను బయటకు రానివ్వాలి.
-ఇప్పుడు చికెన్ ముక్కలను పాన్ లో వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా పెద్ద మంట మీద బాగా కలపాలి. చికెన్ లేత గోధుమ రంగులోకి మారి, అందులోని రసాలు బయటకు వచ్చే వరకు వేయించాలి.
మంటను పూర్తిగా తగ్గించి పెరుగును వేసి కలపాలి. ఇప్పుడు మూతపెట్టి, చికెన్ పూర్తిగా మెత్తబడే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
-చికెన్ బాగా ఉడికి, గ్రేవీ చిక్కబడిన తర్వాత చేతితో నలిపిన కసూరి మేథి ఆకులను, గరం మసాలాను పైన చల్లండి. ఈ రెండు పదార్థాలు కూరకు ప్రాణం పోస్తాయి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి.
-వేడివేడి లాహోరి కడాయి చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








