అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా..

Posted By:

రోజూ తినే అన్నం, కూరలకు బదులు ఒక్కసారి లెమన్ పెప్పర్ రసం రైస్(నిమ్మకాయ మిరియాల రసం రైస్). దీనిని జస్ట్ కడాయిలో ఈజీగా 20 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. దీని తయారీకి పెద్దగా పదార్థాలు అవసరం లేదు. మన వంటగదిలో రెగ్యులర్ గా ఉండే పదార్థాలే సరిపోతాయి.

లంచ్ బిక్స్ కి, జర్నీల టైంలో, రాత్రిపూట లైట్ ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. పొట్టకు హాయినిచ్చే, లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ గా ఉండే లెమన్ పెప్పర్ రసం రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Lemon Pepper Rasam Rice Recipe in Telugu Quick Comforting 20 Minute One Pot Meal

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-కందిపప్పు
-నీళ్లు
-టమాటో
-పసుపు
-మిరియాలు
-ఆవాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-రసం పొడి
-నెయ్యి
-జీడిపప్పు
-కొత్తిమీర
-ఉప్పు

ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు బియ్యం, 4 టేబుల్ స్పూన్ల కందిపప్పు అయినా లేదా పెసరపప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసి శభ్రంగా కడిగా మళ్లీ నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి.

-1 గంట తర్వాత కుక్కర్ లో నానిన బియ్యం,పప్పు వేసుకోండి. ఇందులోనే 2 టమాటోల ముక్కలు, 3 కప్పుల నీళ్లు, అర టీస్పూన్ పసుపు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 4-5 విజిల్స్ రానివ్వాలి.

-అది ఉడికేలోగా, మరోపక్క స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోనే అర టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి నిదానంగా వేయించాలి. జీలకర్ర, మిరియాలు చిట్లిన తర్వాత ఈ మొత్తాన్ని రోట్లోనో లేదా మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి.

-కుక్కర్ లో అన్నం పప్పు మిశ్రమం ఉడికిన తర్వాత మూత తీసి గరిటతో దాన్ని మెత్తగా మెదుపుకోండి.

-తర్వాత ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రసం పొడి వేసి ఇందులో 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి గడ్డలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోండి.

-తర్వాత తాలింపు కోసం.. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత అందులో గుప్పెడు జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచుకోండి. మిగిలిన నెయ్యిలో 1 టీస్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి ముక్కలు వేసి ఎండుమిర్చి నల్లబడేదాకా వేపుకోవాలి. ఎండుమిర్చి నల్లబడుతున్నప్పుడే అందులో కరివేపాకు 12 దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసి వేపాలి.

-తాలింపు వేగిన తర్వాత అందులో మెత్తగా ఉడికించుకున్న అన్నం పప్పు మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇందులోనే 600 ml వేడి నీళ్లు పోసి అన్నాన్ని నీళ్లలో కలిసిపోయేంతవరకు గరిటతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కలిపి ఉంచుకున్న రసం పొడి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, ముందుగా దంచిన మిరియాల మిశ్రమం పొడిని కొంచెం పక్కకు తీసి మిగతాది వేసుకోండి. మూతపెట్టి నిదానంగా 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం జారుగా ఉన్నప్పుడే అందులో కొత్తిమీర, అవసరాన్ని బట్టి కొంచెం నిమ్మరసం వేసి కలిపాక అందులో వేయించిన జీడిపప్పు వేసుకుని కలిపి దించేయండి.

-అంతే లెమన్ పెప్పర్ రసం రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 3, 2026, 16:08 [IST]
Desktop Bottom Promotion