Latest Updates
-
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.!
సంవత్సరమైనా పాడవకుండా ఉండే బియ్యం వడియాలు.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
మన తెలుగు ప్రజలకు పచ్చళ్ళు, అప్పడాలు, రోటి పచ్చలు, వడియాలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకే నెలల ముందే పచ్చళ్ళు పెట్టుకొని నిలువ ఉంచుకొని తింటుంటారు. వాటిలో ముఖ్యమైనది వడియాలు. వీటిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక రెండు రోజులు జోరుగా ఎండ కాసిందంటే చాలు వడియాలు వేసేసి ఇంటి మేడపైన ఆరబెట్టేస్తారు. ఒకసారి చేసుకుంటే ఏడాదిపాటు వచ్చే ఈ వడియాలు ఎన్ని రోజులైనా పాడవకుండా, రుచికరంగా ఉండేలా ఎలా చేసుకోవాలో మేము ఇక్కడ వివరించాము. మేము చెప్పిన విధంగా ఓసారి ట్రై చేసి.. మీ ఫ్రెండ్స్, అండ్ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి.
ముందుగా బియ్యం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం
- మూడు కప్పుల బియ్యం
- తొమ్మిది కప్పుల నీళ్లు
- ఒక స్పూన్ వాము
- రెండు స్పూన్ల జీలకర్ర
- పావు కప్పు నువ్వులు
- రుచికి సరిపడా ఉప్పు

బియ్యం వడియాలు తయారీ విధానం
ఈ బియ్యం వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి. మనం మూడు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి.. తొమ్మిది కప్పుల నీళ్లు గిన్నెలో పోసుకోవాలి. ఆ నీటిని సలసలా మరిగే వరకు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మారిగాకా అందులో మూడు కప్పుల బియ్యం వేసుకోవాలి. అలాగే అదే నీళ్లలో రుచికి సరిపడా ఉప్పును కూడా జత చేసుకోవాలి.
ఇప్పుడు అందులో వాము, జీలకర్ర, నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకొని గిన్నెపైన మూత పెట్టుకోవాలి. బియ్యం, నీళ్లు అన్ని చిక్కగా, గట్టిగా, మందంగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి బియ్యంను చల్లారేవరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చీరను బాగా ఎండ తగిలే ప్రాంతంలో పరుచుకొని.. బియ్యం మిశ్రమాన్ని వడియాల మాదిరిగా పరుచుకోవాలి. అలాగే జంతికల యంత్రంలో ఉంచుకొని జంతికల మాదిరిగా వచ్చే విధంగా కూడా ఈ వడియాలు వేసుకోవచ్చు.
ఇంకొందరు తెల్లని వస్త్రంపై అప్పడాల మాదిరిగా ఉంచుకొని ఎండబెట్టుకుంటారు. ఈ విధంగా కూడా వడియాలు రుచికరంగా ఉంటాయి. అలా వివిధమైన వస్త్రాలపై ఈ వడియాలు రెండు రోజుల పాటు ఎర్రటి ఎండలో ఎండబెడితే వడియాలు సిద్ధమైనట్లే. ఎండిన వడియాలు గిన్నెలో వేసుకున్నప్పుడు గలగలామని శబ్దం వినిపిస్తుంది. అప్పుడే వడియాలు ఎండినట్లు అర్ధం చేసుకోవాలి. వీటిని గాలి దూరని డబ్బాలో ఉంచుకొని నిలువ చేసుకుంటే ఎన్ని నెలలైనా పాడవకుండా అలానే ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
