Latest Updates
-
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే?
అచ్చం బిర్యానీని మించే రుచితో.. ఘుమఘుమలాడే కరివేపాకు మసాలా రైస్ ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా పులిహోర, నిమ్మకాయ అన్నం, లేదా కొబ్బరి అన్నం లాంటివి అందరికీ బాగా అలవాటే. అయితే ఎప్పుడూ అవే కాకుండా కొంచెం కొత్తగా, వెరైటీగా ట్రై చేయాలని ఉందా? అయితే మీరు కచ్చితంగా రుచి చూడాల్సిన అద్భుతమైన వంటకం కరివేపాకు మసాలా రైస్. ఇందులో వాడే మసాలా దినుసులు దీనికి అచ్చం బిర్యానీ లాంటి అద్భుతమైన రుచిని, సువాసనను ఇస్తాయి. ఉదయం పూట హడావిడిగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు, వంట నేర్చుకుంటున్న బ్రహ్మచారులకు, అలాగే పిల్లల లంచ్ బాక్స్ కి ఈ కరివేపాకు మసాలా రైస్ ఒక బెస్ట్ ఆప్షన్.

కరివేపాకు మసాలా రైస్ తయారీకి కావాల్సినవి
వండిన అన్నం - అర కప్పు (లేదా ఒక పెద్ద బౌల్)
నూనె - 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉడికించిన పచ్చి బఠానీలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - 2
జీడిపప్పు - కొద్దిగా
కరివేపాకు - పావు కప్పు (తాజాది)
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
మినపపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
కరివేపాకు మసాలా రైస్ తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించుకుని, ఒక వెడల్పాటి గిన్నెలో ఆరబెట్టుకోవాలి.
- స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, అందులో మినపపప్పు వేసి మీడియం మంట మీద 2 నిమిషాల పాటు దోరగా వేయించాలి. ఆ తర్వాత నువ్వులు వేసి వేయించండి.
-నువ్వులు చిటపటలాడుతూ, పప్పు బంగారు రంగులోకి మారుతున్నప్పుడు కరివేపాకు, జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపేయాలి. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకుని, గాలి చొరబడని సీసాలో వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు పారదర్శకంగా మారాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసి కొద్దిసేపు వేయించాలి. మసాలా అడుగంటకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోవాలి.
-ఈ మిశ్రమం కాస్త చిక్కబడ్డాక, ముందుగా ఆరబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని, సరిపడా ఉప్పును వేసి అన్నానికి పట్టేలా బాగా కలపాలి.
-స్టవ్ ను మీడియం మంట మీద ఉంచి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఆపేయాలి. చివరగా నెయ్యిలో దోరగా వేయించిన జీడిపప్పును అన్నం పైన చల్లుకోవాలి.
--అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాకు మసాలా రైస్ రెడీ. దీనికి సైడ్ డిష్ గా రైతా ఉంటే భోజనం అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
